వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోదండరామ్‌కు చిక్కులు: పాలమూరు రిపీట్?

By Pratap
|
Google Oneindia TeluguNews

 Kodandaram
హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ మళ్లీ చిక్కుల్లో పడినట్లే కనిపిస్తున్నారు. మహబూబ్‌నగర్ ఉప ఎన్నిక రిపీట్ అవుతోంది. ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసన మండలికి జరిగే ఎన్నికలు కోదండరామ్‌కు మళ్లీ కష్టాలు తెచ్చి పెట్టే అవకాశాలున్నాయి. ఉత్తర తెలంగాణ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఉపా ద్యాయ సంఘాల మాజీ నేత స్వామి గౌడ్‌ను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తమ అభ్యర్థిగా ప్రకటించారు. జేఏసీలో మరో భాగస్వామి అయిన బిజెపి కూడా పోటీ చేయడానికి సిద్ధపడింది.

స్వామి గౌడ్‌పై బిజెపి పోటీ అనైతికమని కెసిఆర్ చేసిన వ్యాఖ్య బిజెపి నాయకులను రెచ్చగొట్టిందని అంటున్నారు. కెసిఆర్ వ్యాఖ్యలపై గురువారం మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయాలు వేరు, ఉద్యమాలు వేరు అని వ్యాఖ్యానిస్తూ, అసలు స్వామిగౌడ్‌ అభ్యర్థిత్వాన్ని తమతో సంప్రదించకుండా ప్రకటించారని చెప్పారు. స్వామిగౌడ్‌ను తాము తెరాస అభ్యర్థిగానే పరిగణిస్తామని, తమ పార్టీ తరఫున అభ్యర్థులను నిలిపి తీరుతామని అన్నారు. పరకాల, పాలమూరు ఉప ఎన్నికలలో పోటీ చేసినట్టే ఈసారీ బరిలో ఉంటామన్నారు.

బీజేపీ జాతీయ పార్టీ కాదని, పెద్ద ప్రాంతీయ పార్టీ మాత్రమేనని కెసిఆర్ కరీంనగర్ మేధోమథన సదస్సు సందర్భంగా అనడమే బిజెపి నాయకులను రెచ్చగొట్టిందని అంటున్నారు. రెండు తెలంగాణ పార్టీల మధ్య చిచ్చు కోదండరామ్‌ను ఇరకాటంలో పెడుతోందని అంటున్నారు. ప్రస్తుత పరిణామం తెలంగాణ జెఎసిలోనే చిచ్చు పెడుతుందా అనే అనుమానాలను కలిగిస్తున్నాయి. పాలమూరు, పరకాల ఉప ఎన్నికల తర్వాత కెసిఆర్‌తో సంబంధాలు దెబ్బ తినడంతో కోదండరామ్ ఇటు బిజెపితో, అటు సిపిఐతో సంబంధాలను పెంచుకున్నారు.

తాజా పరిణామంతో కోదండరామ్ చిక్కుల్లో పడినట్లే. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా కోదండరామ్ పరిస్థితి తయారైంది. తెలంగాణ రాజకీయ పార్టీలను సమన్వయ పరచడం ఆయనకు సమస్యగానే తయారైంది. ఆయా పార్టీలు తమ తమ రాజకీయ ప్రయోజనాలకు ఇస్తున్న ప్రాధాన్యం తెలంగాణ ఉద్యమానికి ఇవ్వకపోవడం పెద్ద సమస్యగా మారింది.

English summary
Telangana JAC chairman kodandaram is in fresh trouble due to the rift between Telangana Rastra Samithi and BJP on MLC election. TRS president KCR has announced Swamui Goud's name for the seat. BJP also decided to contest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X