వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిచ్చెస్ట్ సిఎం: నాలుగో స్థానంలో కిరణ్, మాయా ఫస్ట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Mayawati
అత్యంత ధనవంత ముఖ్యమంత్రులలో మన ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయన గత ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తి రూ. 8.1 కోట్లుగా చూపించారు. త్వరలో ఉత్తర ప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడి ముఖ్యమంత్రులు తమ ఆస్తులను ఎన్నికల అఫిడవిట్‌లలో సమర్పించారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి అందరికంటే ఎక్కువ ఆస్తి కలిగి ఉండి దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచారు. ఎడిఆర్ నివేదిక ప్రకారం ఆమె తన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తి రూ.87.27 కోట్లుగా చూపించారు. అందులో రూ.74 కోట్లకు పైగా స్థిరాస్తి ఉంది.

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత రూ.51కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఆమె తన పెంపుడు కొడుకు పెళ్లి అంగరంగ వైభవంగా చేసినప్పటి నుండి ఆమె ఆస్తులపై వివాదం కొనసాగుతోంది. అప్పటి వరకు ఎవరూ చేయనంత ఖర్చుతో ఆమె తన తనయుడు పెళ్లిని చేసింది. ఇటీవలె తన సహచరి శశికళ, ఆమె భర్త, తన పెంపుడు తనయుడిని పార్టీ నుండి బహిష్కరించిన విషయం తెలిసిందే. జయలలిత ఆస్తుల కేసు నుండి తప్పించుకోవడానికే వారిని పార్టీ నుండి బహిష్కరిస్తోందని విపక్షాలు విమర్శించాయి. మూడో స్థానంలో పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ ఉన్నారు. ఆయన ఆస్తి రూ.9.2 కోట్లు

వీరి ముగ్గురి తర్వాత నాలుగో స్థానంలో మన సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఆ తర్వాత ఐదో స్థానం నుండి చివరి ఐదు స్థానాల వరకు ఉన్న ముఖ్యమంత్రుల ఆస్తులు రూ. కోటి నుండి ఐదు కోట్ల మధ్యనే ఉన్నాయి. ఒరిస్సా సిఎం నవీన్ పట్నాయక్‌కు రూ.4 కోట్లు, గోవా సిఎం దిగంబర్ కామత్‌కు 3.23 కోట్లు ఆస్తి కలిగి ఉన్నారు. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కేవలం రూ.1 కోటి ఆస్తి మాత్రమే కలిగి ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి, జమ్ము-కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా ఆరు నుండి తొమ్మిది స్థానాల్లో ఉన్నారు. అందరికంటే తక్కువగా మణిపూర్ సిఎం ఓక్రమ్ సింగ్ కేవలం రూ.6.09 లక్షల ఆస్తి మాత్రమే కలిగి ఉన్నారు.

English summary
Uttar Pradesh CM Mayawati is the richest sitting chief minister going for polls in February this year. Mayawati has assets worth Rs 87.27 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X