నరేంద్ర మోడీ జోరు నితీష్ కుమార్ బేజారు

Narendra Modi - Nitish Kumar
ఎన్డీయేలో 2014 సాధారణ ఎన్నికలకు ప్రధాని అభ్యర్థి రేసులో ఉన్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హవా క్రమంగా పెరుగుతుంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జోరు తగ్గుతున్నట్లుగా కనిపిస్తోంది. ఎన్డీయే అభ్యర్థిగా ఎన్డీయే నుండి సుష్మా స్వరాజ్, ఎల్ కె అద్వానీ తదితరుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ ప్రధానంగా మోడీ, నితీష్ ఇద్దరే ఉన్నారు! ప్రధాని రేసులో ఉన్న వీరిద్దరిలో నితీష్‌కు తొలుత మద్దతు బాగానే లభించింది.

అయితే ఇటీవలి కాలంలో ఆయన తన ప్రభను కోల్పోతున్నట్లుగా కనిపిస్తోంది. అదే సమయంలో నరేంద్ర మోడీ ప్రాధాన్యత పెరుగుతోంది. నరేంద్ర మోడీపై గోద్రా అల్లర్లు మినహా మరే మచ్చ లేదు. అదే సమయంలో దేశంలో ఉన్న ముస్లింల జీవన పరిస్థితి తీసుకుంటే గుజరాత్‌ రాష్ట్రమే టాప్‌లో ఉంది. గుజరాత్ ముస్లింల జీవన పరిస్థితి బాగా ఉండటానికి కారణం గోద్రా అల్లర్ల మచ్చ పడిన, హిందుత్వవాదిగా ముద్రపడిన నరేంద్ర మోడీ ఘనత కావడం గమనార్హం.

మోడీని టార్గెట్‌గా పెట్టుకున్న వాళ్లు గోద్రా మినహా మరే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించరు! ప్రస్తావించరు అనేకంటే ఆయన ఆ అవకాశం ఇవ్వలేదనడమే బెట్టర్! అయితే ఆ తర్వాత రాష్ట్రాన్ని అతను చేసిన అభివృద్ధి దానిని క్రమంగా మరుగుపర్చుతోంది. మోడీ రాష్ట్రాన్ని తీర్చిన తీరు దేశంలోని ఇతర కాంగ్రెసు పాలిత రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకునేలా ఉందంటే ఆశ్చర్యమేమీ కాదు. గుజరాత్‌లా తీర్చుదిద్దుతాం అని ఇతర కాంగ్రెసు పాలిత రాష్ట్రాల నేతలు కూడా చెబుతుండటం మనం తరుచూ వింటూనే ఉన్నాం.

గుజరాత్‌లోని ముస్లింలు కూడా మోడీకే మద్దతు పలుకుతున్నారట. గుజరాత్‌ను మోడీ దేశంలోనే టాప్‌లో ఉంచారు. ఈ సంవత్సరం చివర్లో జరిగే సాధారణ ఎన్నికలలో మళ్లీ ఆయనే గెలుస్తారని సర్వేలు కూడా చెబుతున్నాయి. దీంతో గుజరాత్‌ను అత్యుత్తమంగా తీర్చిద్దిదిన మోడీకి దేశాన్ని అప్పగిస్తే మరెంతో అభివృద్ధి చేస్తారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో మోడీకి మద్దతు బాగానే పెరుగుతుంది.

జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి నాలుగు రోజుల క్రితం మాట్లాడుతూ.. మోడీయే ఎన్డీయే తరఫున సరైన ప్రధాని అభ్యర్థి అన్నారు. మోడి లౌకికవాదే అని, అందుకే ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చారన్నారు. హిందువులందరూ లౌకికవాదులేనని, మోడీ హిందుత్వ సిద్దాంతాన్ని నమ్ముతారని, హిందువులకు లౌకికవాదం పుట్టుకతోనే వస్తుందని సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు. ప్రముఖ న్యాయవాది, బిజెపి ఎంపి రాంజెత్మలానీ కూడా మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలంటూ గడ్కరీకి లేఖ రాశారు.

అదే సమయంలో నితీష్ కుమార్ క్రమంగా ప్రభ కోల్పోతున్నట్లుగా కనిపిస్తున్నారు. జెడి(యు) అధికారంలోకి రాకముందు బీహార్‌లో పరిస్థితి దారుణంగా ఉండేది. నిత్యం అహింసే. అయితే నితీష్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ బాగుంది. నితీష్ రెండోసారి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం లా అండ్ ఆర్డరే. నితీష్ అభివృద్ధిలోనూ మోడీతో పోటీ పడుతున్నారు. అయితే ఇటీవల నితీష్‌కు సొంత రాష్ట్రంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

తొలిసారి అధికారంలో ఉన్నప్పుడు అంతా సక్రమంగా కనిపించింది. ఇటీవల ఆయన పర్యటనలో విమర్శలు కనిపించాయి. నిరుద్యోగ సమస్యపై యువకులు గళమెత్తారు. కొందరు ముఖ్యమంత్రి యాత్రలో చెప్పులు కూడా విసిరారు. నితీష్ పాలనపై ఓ న్యాయమూర్తి రెండు రోజుల క్రితం మాట్లాడుతూ.. ఆయన పాలనపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. 2014 సాధారణ ఎన్నికలు జరగనున్న కీలక సమయంలో నితీష్ జోరు తగ్గడం, మోడీ హవా పెరుగుతుండటం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+