కోటరీలో విభేదాలు: సోనియాకు ఆంధ్ర చిరాకు

రాష్ట్రంలో నాయకత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉందని రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోనీ అభిప్రాయపడుతుండగా, అవసరం లేదని ఆర్థిక మంత్రి పి. చిదంబరం వాదిస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి బాగా పనిచేస్తున్నారని, అవసరమైతే పిసిసి అధ్యక్షుడిని మారిస్తే సరిపోతుందని చిదంబరం వాదిస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి మార్పు ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ముందుగా తెలంగాణ అంశాన్ని తేల్చాలని చిదంబరం అంటున్నారని చెబుతున్నారు.
చిదంబరం వాదనతో ఆంటోనీ విభేదిస్తున్నట్లు చెబుతున్నారు. పాలన కుంటుపడిందనేది ఆంటోనీ వాదనగా చెబుతున్నారు. గవర్నర్, సీనియర్ నాయకులు, ఎంపీలు సైతం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నివేదికలు ఇస్తున్న విషయా న్ని గుర్తు చేస్తున్నారట. కొత్త వారికి పగ్గాలు అప్పచెబితే ఇప్పుడు ఉన్న వ్యతిరేకత తగ్గిపోతుందని అంటూసమర్ధులకు నాయకత్వం అప్పగించాలని, ప్రధానంగా అందరినీ సమన్వయం చేసుకునే వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. జగన్‌ను ఎదుర్కోవాలంటే ముందు పార్టీలో ఒక స్పష్టత రావలసిన అవసరం ఉందని ఆయన చెబుతున్నారని సమాచారం.
ఈ క్రమంలో రాహుల్ గాంధీ మాత్రం ముఖ్యమంత్రి పదవి కోసం మర్రి శశిధర్‌రెడ్డి, జానారెడ్డి పేర్లు పరిశీలిస్తున్నారని వారిద్దరి ఎంపికతోపాటు, తెలంగాణ అంశానికీ ఈ వారంలోనే తెరదించాలన్న భావనతో ఉన్నారని చెబుతున్నారు. అందులో భాగంగా ప్రత్యేక ప్యాకేజీతో కూడిన తెలంగాణ అభివృద్ధి బోర్డును ఏర్పాటుచేయాలని నిర్ణయించినటలు చెబుతున్నారు.
ఈ స్థితిలో దిగ్విజయ్‌సింగ్ కూడా రాష్ట్ర వ్యవహారాలపై పరిశీలన ప్రారంభించారు. రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకులతో ఆయన చర్చిస్తున్నారు. ప్రత్యామ్నాయ నాయకుడి పేర్లు, తెలంగాణ అంశం, రాష్ట్రంలో పార్టీ వ్యవ హారాలను అడిగి తెలుసుకుంటున్నారు. శనివారం నుంచి ఆయన డిల్లీలో ఉండని కారణంగా శుక్రవారం రాత్రే సోనియాకు ఒక నివేదిక ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications