జయ సరే: బాబు, జగన్, కెసిఆర్‌ల్లో ఎవరు?(పిక్చర్స్)

చెన్నై/ హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రాజకీయ స్నేహం చేస్తున్నారు. తృతీయ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగానే ఈ స్నేహం మొగ్లలు తొడుగుతున్నట్లు తెలుస్తోంది. మూడో ఫ్రంట్ ఏర్పాటుపై సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కసరత్తు చేస్తున్నారు. దీని ఏర్పాటు ఎంతైనా అవసరమని ఆయన కుమారుడు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్, బీజేపీ తమ హామీలు నిలబెట్టుకోలేకపోయాయని, కాబట్టి జాతీయ స్థాయిలో మూడో ఫ్రంట్ ఏర్పడడం చాలా ముఖ్యమన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చెన్నై పర్యటనకు తొలిసారి విచ్చేసిన అఖిలేశ్ మీడియాతో మాట్లాడారు. ఈ ఫ్రంట్ ఏర్పడాల్సిన అవసరం ఉందని సమాజ్‌వాది గట్టిగా విశ్వసిస్తున్న దన్నారు. కాంగ్రెసు, బిజెపి చేపట్టే విధానలేమీ పేదవారికి ఉపయోగడడంలేదని, ఆ రెండు పార్టీలు వారి భాగస్వామ్య పక్షాలు అన్ని విధాలుగా విఫలమయ్యాయనీ విమర్శించారు. ఈ పరిస్థితుల్లో మూడో ఫ్రంట్ ఆవశ్యకత ఉందని ఆయన స్పష్టం చేశారు.

చెన్నైలో పిఎంకె పార్టీ వన్నియార్ యూత్ కల్చరల్ ఫెస్టివల్‌ను ప్రారంభిం చేందుకు విచ్చేసిన అఖిలేశ్, ముఖ్యమంత్రి జయలలితను కలుసుకొని 30 నిమిషాలకు పైగా చర్చలు జరిపారు. మూడో ఫ్రంట్ఏర్పాటుపై ప్రాంతీయపార్టీలైన పిఎంకె, అన్నాడిఎంకెల మద్దతు కోరానని ఆయన తెలిపారు. అయితే, యుపిఎకు మాత్రం సమాజ్‌వాదీ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడం లేదు. అయితే, వచ్చే ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని మూడో కూటమికి శ్రీకారం చుట్టాలనేది ములాయం సింగ్ ఆలోచనగా తెలుస్తోంది.

ములాయం సింగ్ మూడో కూటమిని ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ములాయం సింగ్ మూడో కూటమిలోకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానిస్తారా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను ఆహ్వానిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇద్దరినీ ఆహ్వానిస్తారా అనేది కూడా చెప్పలేని స్థితి. అయితే, ఇద్దరు ఒకే కూటమిలో కొనసాగుతారా అనేది సమాధానం లేని ప్రశ్న.

చంద్రబాబు మాత్రం మూడో కూటమి పట్ల ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో తన సత్తా చాటడానికి మాత్రమే కాకుండా, జాతీయ స్థాయిలో తనకు అండగా నిలబడే పార్టీలు కూడా ఉంటాయని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు సంపాదిండంపైనే దృష్టి పెట్టిన చంద్రబాబు మూడో కూటమిపై ఇప్పుడే ఆలోచించే అవకాశాలు లేవు. ఓడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కలిసి వస్తారా, లేదా అనేది కూడా సందేహంగానే ఉంది. ఇంకా చిన్నా చితకా పార్టీలు చాలా ఉన్నాయి. వీటన్నింటినీ ఏకతాటి మీదికి తెచ్చి బిజెపి, కాంగ్రెసులకు ప్రత్యామ్నాయంగా నిలిపి తాను ప్రధాని పీఠం అధిష్టించాలనే ములాయం సింగ్ కోరిక ఏ మేరకు నెలవేరతుందనేది చెప్పలేం. మూడో ఫ్రంట్ కల్ల అని బిజెపి నాయకులు అంటున్నారు.

జయ సరే: బాబు, జగన్, కెసిఆర్‌ల్లో ఎవరు? (పిక్చర్స్)

జయ సరే: బాబు, జగన్, కెసిఆర్‌ల్లో ఎవరు? (పిక్చర్స్)

ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మూడో కూటమి ఏర్పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి జాతీయ స్థాయిలో కీలక స్థానం కట్టబెడుతుందా అనే చర్చ సాగుతోంది. వామపక్షాలతోనే కాకుండా గత ప్రయత్నాల ఫలితంగా ములాయంతోనూ చంద్రబాబుకు సత్సంబంధాలున్నాయి. ఢిల్లీలో తగిన పలుకుబడి చంద్రబాబుకు ఉంది. అయితే, రాష్ట్రంలో టిడిపి తిరిగి జెండా ఎగురవేయడమే చాలా కష్టంగా మారింది. ఇప్పుడు తిరిగి పార్టీని అధికారంలోకి తేవడం మినహా మరో ఆలోచన చంద్రబాబుకు ఉండేట్లు లేదు.

జయ సరే: బాబు, జగన్, కెసిఆర్‌ల్లో ఎవరు? (పిక్చర్స్)

జయ సరే: బాబు, జగన్, కెసిఆర్‌ల్లో ఎవరు? (పిక్చర్స్)

తృతీయ కూటమిలోకి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను లాగడానికే అన్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భేటీ జరిగింది. జయలలిత మూడో కూటమికి అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంది. ఆమె బిజెపి, కాంగ్రెసేతర పక్షాలతో సన్నిహితంగానే ఉంటున్నారు. కానీ, సమయానికి ఏం చేస్తారనేది చెప్పలేం. కరుణానిధి నేతృత్వంలోని డిఎంకె కాంగ్రెసుకు పూర్తిగా దూరమైతే ఆమె అటు వైపు చేరినా ఆశ్చర్యం లేదనే మాట వినిపిస్తోంది.

జయ సరే: బాబు, జగన్, కెసిఆర్‌ల్లో ఎవరు? (పిక్చర్స్)

జయ సరే: బాబు, జగన్, కెసిఆర్‌ల్లో ఎవరు? (పిక్చర్స్)

మూడో కూటమి ఏర్పాటుకు తన ప్రధాన ప్రత్యర్థి ములాయం సింగ్ ప్రయత్నాలు సాగిస్తున్నందున బిఎస్పీ అధినేత మాయావతి దూరంగానే ఉండవచ్చు. ఆమెకు ప్రధాని కావాలనే కోరిక బలంగా ఉంది. ఆ విషయాన్ని ఆమె బహిరంగంగానే వెల్లడించారు. అయితే, ఆమెకు సహకరించే పక్షాలు ఏవనేది సందేహం. మూడో కూటమిలో ఆమెకు ఆ అవకాశాలు లేనట్లే. ఆమె మూడో కూటమిలో ఉండే పరిస్థితి కూడా లేదు.

జయ సరే: బాబు, జగన్, కెసిఆర్‌ల్లో ఎవరు? (పిక్చర్స్)

జయ సరే: బాబు, జగన్, కెసిఆర్‌ల్లో ఎవరు? (పిక్చర్స్)

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కూడా తమ కూటమిలోకి లాగడానికి ములాయం సింగ్ బలంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమెను గతంలో ప్రశంసలతో ముంచెత్తారు కూడా. కానీ, మమతా బెనర్జీ ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ అంతు పట్టదు.

జయ సరే: బాబు, జగన్, కెసిఆర్‌ల్లో ఎవరు? (పిక్చర్స్)

జయ సరే: బాబు, జగన్, కెసిఆర్‌ల్లో ఎవరు? (పిక్చర్స్)

సిపిఐ, సిపిఎంలు ములాయం సింగ్ ప్రయత్నాలకు సానుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కాంగ్రెసు, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా మరో రాజకీయ కూటమిని వామపక్షాలు సమర్థించే అవకాశాలున్నాయి.

జయ సరే: బాబు, జగన్, కెసిఆర్‌ల్లో ఎవరు? (పిక్చర్స్)

జయ సరే: బాబు, జగన్, కెసిఆర్‌ల్లో ఎవరు? (పిక్చర్స్)

మాజీ ప్రధాని దేవెగౌడ కూడా మూడో కూటమి ఏర్పాటుకు సుముఖంగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. అయితే, ఆయన ప్రస్తుతం ఆయనకు, ఆయన కుమారుడు కుమారస్వామికి రాష్ట్రంలో అధికారంలోకి రావడం ముఖ్యంగా మారింది.

జయ సరే: బాబు, జగన్, కెసిఆర్‌ల్లో ఎవరు? (పిక్చర్స్)

జయ సరే: బాబు, జగన్, కెసిఆర్‌ల్లో ఎవరు? (పిక్చర్స్)

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ములాయం సింగ్ మూడో కూటమిలోకి ఆహ్వానిస్తారా అనేది సందేహంగానే ఉంది. అయితే, వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు వస్తే మాత్రం జగన్ కీలకం అవుతారు. యుపిఎకు మద్దతు ఇస్తానని జగన్ చెప్పారు. చంద్రబాబు, జగన్ ఒకే కూటమిలో ఉండడం కూడా సాధ్యం కాదు. చంద్రబాబుకు సీట్లు రాకుండా జగన్‌కు వస్తే పరిస్థితి తారుమారు అవుతుందా అనేది కూడా ఉంది.

జయ సరే: బాబు, జగన్, కెసిఆర్‌ల్లో ఎవరు? (పిక్చర్స్)

జయ సరే: బాబు, జగన్, కెసిఆర్‌ల్లో ఎవరు? (పిక్చర్స్)

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు జాతీయ రాజకీయాల్లో కీలకం అవుతారా అనేది చర్చనీయాంశంగానే ఉంది. తాను 15, 16 లోకసభ స్థానాలు గెలుస్తానని కెసిఆర్ అంటున్నారు. అన్ని సీట్లు సాధిస్తే జాతీయ రాజకీయాల్లో, ప్రభుత్వ ఏర్పాటులో కీలకమే అవుతారు. తెలంగాణ ఇచ్చే పార్టీకే తాను మద్దతు ఇస్తానని ఆయన అంటున్నారు. ములాయం సింగ్ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారు. అందువల్ల ఆయన ఎటు వెళ్తారనేది చెప్పలేని స్థితి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+