హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పిక్చర్స్: ప్రతిసారీ ఉస్మానియా వేడెక్కుతుంది, ఇలా..

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం విషయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రతిసారీ రగిలిపోవడం ఆనవాయితీగా మారింది. తెలంగాణ సమరదీక్ష నేపథ్యంలో ఆదివారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులపైకి రాళ్లు రువ్వడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.

తెలంగాణపై కేంద్రం తన వైఖరిని తెలపాలంటూ ఓయూ జెఎసి చేపట్టిన రాజ్‌భవన్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. ఒక వైపు రాళ్ల వర్షం, మరో వైపు బాష్పవాయువు గోళాల ప్రయోగంతో ఓయూ అట్టుడికింది. ఆదివారం ఓయూ జెఎసి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయం నుంచి ర్యాలీగా బయటకు వెళ్లే ప్రయత్నంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో క్యాంపస్ రణరంగంగా మారింది. ఎన్‌సీసీ గేటు వైపు ర్యాలీగా వచ్చిన వందలాది మంది విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ పోలీసులు పెద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు.

 పిక్చర్స్: ప్రతిసారీ ఉస్మానియా వేడెక్కుతుంది, ఇలా..

ఆదివారంనాడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న విద్యార్థులు

 పిక్చర్స్: ప్రతిసారీ ఉస్మానియా వేడెక్కుతుంది, ఇలా..

తెలంగాణ డిమాండ్‌పై దిష్టిబొమ్మను తగులబెడుతూ నినాదాలు చేస్తున్న విద్యార్థులు

 పిక్చర్స్: ప్రతిసారీ ఉస్మానియా వేడెక్కుతుంది, ఇలా..

విద్యార్థులు రాజ్‌భవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో అడ్డగించడానికి విశ్వవిద్యాలయం గేట్లు మూసేసిన అధికారులు, ప్రతిసారీ ఇది ఆనవాయితీగా మారింది.

 పిక్చర్స్: ప్రతిసారీ ఉస్మానియా వేడెక్కుతుంది, ఇలా..

ఉస్మానియా విశ్వవిద్యాలంయ గేటును మూసేసి కాపలా కాస్తున్న బలగాలు

 పిక్చర్స్: ప్రతిసారీ ఉస్మానియా వేడెక్కుతుంది, ఇలా..

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓ వైపు విద్యార్థులు, మరో వైపు బలగాలు

విద్యార్థులు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. పోలీసులు పెద్ద ఎత్తున బాష్పవాయులు గోళాలను ప్రయోగించి విద్యార్థులను చెదరగొట్టారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతామంటూ విద్యార్థులు ఎన్‌సిసి గేటు ఆవరణలో మోకాళ్ల పై బైఠాయించి నిరసన తెలిపారు. మరో వైపు గేటు దూకి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.బాష్పవాయువును ప్రయోగించడంతో కరాటేరాజు, పీడీఎస్‌యూ నాయకుడు బొల్గూరి కిరణ్‌కు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. జేఏసీ నాయకుడు బాల్‌రాజ్, శేఖర్, రిజ్వానాలు గాయపడ్డారు.

English summary
Once again Osmania University has been boiled by the students rally on Sunday. Tension prevailed the police obstructed the rally. It became a regular practice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X