వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడికి 38, నితీష్‌కి 3శాతం: వెనుకబడ్డ రాహుల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Survey puts Narendra Modi as leading PM choice
భారతీయ జనతా పార్టీ ముఖ్య నేత, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీయే ప్రధాని పదవికి సరైన అభ్యర్థి అని హిందూస్థాన్ టైమ్స్ సర్వేలో మరోసారి వెల్లడైంది. కొన్నాళ్లుగా చేస్తున్న సర్వేలు 2014 ఎన్నికలలో మోడీకి, ఎన్డీయే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి. తాజా సర్వేలో మోడీ ఇంకొంత ముందుకు రాగా, ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ మరికొంత వెనుకపడ్డారు. సర్వే ప్రకారం...

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బిజెపికి 42 శాతం, కాంగ్రెసుకు 35 శాతం, సిపిఎంకు నాలుగు శాతం ఓట్లు పడతాయి. కూటములుగా చూస్తే ఎన్డీయే కూటమికి 47 శాతం ఓట్లు, యూపిఏకు 35 శాతం పడతాయి. ప్రధానమంత్రిగా మోడీ వైపు 38 శాతం మంది మొగ్గు చూపిస్తున్నారు. రాహుల్ గాంధీకి కేవలం 23 శాతం మందే ఓటేశారు. మరో విషయమేమంటే మోడీని వ్యతిరేకిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను 3 శాతం మందే ప్రధానమంత్రి అభ్యర్థిగా కోరుకుంటున్నారు.

మన్మోహన్ సింగ్‌ను 14 శాతం, ఎల్‌కె అద్వానీని 6 శాతం, సోనియాను 5 శాతం మంది ప్రధానిగా కోరుకుంటున్నారు. థర్డ్ ఫ్రంట్ వస్తే నితీష్ కుమార్‌ను 21 శాతం మంది, మమతా బెనర్జీని 14 శాతం, లాలూ ప్రసాద్ యాదవ్‌ను 13 శాతం, మాయావతిని 11 శాతం, జయలలితను 11 శాతం, ములాయం సింగ్ యాదవ్‌ను 7 శాతం మంది ప్రధానిగా కోరుకుంటున్నారు.

విద్య, వైద్యం, ఉగ్రవాదం, శాంతిభద్రతల పరిస్థితులు, అవినీతి, ద్రవ్యోల్భణం తదితర అంశాల పట్ల బిజెపియే సమర్థవంతంగా వ్యవహరించగలదని ఎక్కువ మంది ఓటర్లు భావిస్తున్నారు. ఈ అంశాలపై బిజెపికి యాభై శాతం కంటే ఎక్కువగా, కాంగ్రెసుకు 37 శాతం ఓట్లు పడ్డాయి. గత ఎన్నికల్లో పార్టీకి ఓటు వేసిన వారిలో బిజెపి పదింట తొమ్మిది మందిని నిలుపుకుంటుంది. యువత బిజెపి వైపు, మోడీవైపు చూస్తోంది. మూడో ఫ్రంట్‌కు వారు ఆసక్తి చూపించడం లేదు.

English summary
Hindustan Times-GFK survey puts Gujarath CM Narendra Modi and NDA ahead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X