వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజన: రాజీనామాల దిశగా కిరణ్ నడిపిస్తారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాల ఉద్యమానికి నాయకత్వం వహిస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెసు పార్టీ అధిష్టానాన్ని ఒప్పించేందుకు ఇంకా అవకాశం ఉందని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో చెప్పాల్సిందంతా చెప్పి చివరికి కలిసికట్టుగా సీమాంధ్ర మంత్రుల చేత రాజీనామాలు చేయించే దిశగా కదులుతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సీమాంధ్రకు చెందిన మంత్రులు గంటా శ్రీనివాస రావు, ఏరాసు ప్రతాపరెడ్డి, కాసు వెంకటకృష్ణారెడ్డి సోమవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. తమ రాజీనామాలు ఆమోదం పొందేలా చూడాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. అదే విధంగా గవర్నర్ నరసింహన్‌ను కూడా కలిసి తమ రాజీనామాలను ఆమోదించాలని వారు కోరారు. అయితే, రాజీనామా లేఖలు తన వద్దకు రాలేదు కాబట్టి తాను ఏమీ చేయలేనని ఆయన చెప్పినట్లు సమాచారం.

ఆ తర్వాతనే ఆ ముగ్గురు మంత్రులు ముఖ్యమంత్రిని కలిసి తమ రాజీనామాలను ఆమోదం కోసం గవర్నర్‌కు పంపించాలని కోరారు. అయితే, కొంత కాలం ఆగాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. తగిన సమయంలో అందరం కలిసే నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి తమకు చెప్పినట్లు మంత్రి గంటా శ్రీనివాస రావు మీడియా ప్రతినిధులతో చెప్పారు.

కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మరోసారి పార్టీ అధిష్టానాన్ని కలిసి చివరిసారిగా సమైక్యాంధ్రకు అనుకూలంగా తమ అభిప్రాయం వినిపిస్తారని, అప్పటికి కూడా అధిష్టానం తమ మాట వినకుండా రాష్ట్ర విభజనకు ముందుకు సాగితే రాజీనామాలు చేయాలనే నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. సీమాంధ్ర మంత్రులు మూకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు సిద్ధపడతారని, అందుకు ముఖ్యమంత్రి నాయకత్వం వహిస్తారని అంటున్నారు.

English summary
It is said that CM Kiran kumar Reddy may lead Seemandhra ministers and MLAs towards the enmass resignations opposing the bifurcation of Andhra Pradesh state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X