andhra pradesh assembly elections 2019 andhra pradesh andhra pradesh assembly seats ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019 ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: అరకు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 లో జరిగిన నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా కొత్తగా అరకు (ఎస్టీ) నియోజకవర్గంగా ఏర్పడింది. గతంలో ఉన్న చింతపల్లి నియోజకవర్గం 2009 లో రద్దు అయింది. పాడేరు నియోజకవర్గం నుండి ముంచింగిపుట్టు మండలం, పెదబయ లు, శృంగవరపు కోట నియోజకవర్గం నుండి అరకు మండలం వచ్చి కలిసింది. పలు గ్రామాలు ఇందులో చేరాయి. ప్రఖ్యా త పర్యటక కేంద్రం అరకు కొత్తగా నియోజకవర్గంగా ఏర్పడింది. అంతుకు ముందు ఉన్న చింతపల్లిలో కాంగ్రెస్ నేత డి. కొండల రావు మూడు సార్లు, టిడిపి నేతల ఎమ్ వి సత్యానారాయణ రెండు సార్లు సిపిఐ నేత దేముడు రెండు సార్లు విజ యం సాధించారు. దేముడు 2004 లో చేరినా..2009 లోపాడేరు నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఇక, అరకు నియోజకవర్గా ల్లో రెండు సార్లు ఎన్నికలు జరిగాయి.
12 సార్లు ఎన్నికలు..
చింతపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అయిదు సార్లు గెలవగా, రెండు సార్లు టిడిపి గెలిచింది. కాగా, సిపిఐ రెండు సార్లు గెలుపొందింది. ఇక, అరకులో 2009 లో జరిగిన తొలి ఎన్నికల్లో టిడిపి నుండి సివేరి సోమ కాంగ్రెస్ అభ్యర్ది కాంతమ్మ మీద గెలిచారు. అక్కడ బిఎస్పీ నుండి పోటీ చేసిన రాజారావు సైతం 13,302 ఓట్లు సాధించారు. ఇక, 2014 నాటికి ఇక్కడ అభ్య ర్దులు మారారు.

2014 ఎన్నికల్లో వైసిపి గెలుపు..
2014 ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 214100 ఓట్లు ఉండగా, అందులో145176 ఓట్లు పోలయ్యాయి. వైసిపి నుండి కిడారి సర్వేశ్వ ర రావు పోటీ చేయగా ఆయనకు 63700 ఓట్లు వచ్చాయి. టిడిపి నుండి పోటీ చేసిన సోమ కు 29647 ఓట్లు వచ్చాయి. టిడి పి అభ్యర్ది సర్వేశ్వరరావు 34053 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ వైసిపి నుండి గెలిచిన సర్వేశ్వర రావు ఆ తరువాత టిడిపిలో చేరి విప్ పదవి పొందారు. కొంత కాలం క్రితం మావోయిస్టుల దాడి సిట్టింగ్ ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మె ల్యే సోము ఇద్దరు హతం అయ్యారు. సర్వేశ్వర రావు కుమారుడు శ్రావణ్ కు కొత్తగా మంత్రిగా అవకాశం ఇచ్చారు.