ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: జగ్గంపేట నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఇక్కడ గోకవరం, కిర్లంపూడి మండలాలు కొత్తగా చేరాయి. ఇక్క డ తోట సుబ్బారావు మూడు సార్లు గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్దిగా పంతం పద్మనాభం రెండు సార్లు, టిడిపి అభ్యర్దిగా జ్యోతుల నెహ్రూ రెండు సార్లు గెలిచారు. పంతం పెద్దాపురం నియోజకవర్గం నుండి మరో రెండు సార్లు గెలుపొందారు. తోట సుబ్బారావు, జ్యోతుల వెంకటప్పారావులు మేనమామ, మేనల్లుళ్లు అవుతారు. 2004 లో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన తోట నరసింహం అప్పుడు టిడిపిలో ఉన్న నెహ్రూ పై గెలుపొందారు. 2009 ఎన్నికల సమయానికి నెహ్రూ ప్రజారాజ్యం లో చేరారు. ఆ ఎన్నికల్లోనూ నెహ్రూ పై కాంగ్రెస్ నుండి పోటీ చేసిన తోట నర్సింహం గెలిచి మంత్రి అయ్యారు. 2014 ఎన్నిక ల్లో ఆయన టిడిపి లో చేరి కాకినాడ ఎంపీగా గెలిచారు.
14 సార్లు ఎన్నికలు జరిగితే..
ఇక్కడ మొత్తంఆ 14 సార్లు ఎన్నికలు జరిగితే అందులో ఆరు సార్లు కాంగ్రెస్ గెలిచింది. అయిదు సార్లు టిడిపి గెలవగా, స్వ తంత్రులు రెండు సార్లు గెలుపొందారు. ఒక సారి వైసిపి నెగ్గింది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుండి పోటీ చేసిన జ్యోతుల నెహ్రూ 2014 ఎన్నికల సమయంలో వైసిపి లో చేరారు. టిడిపి నుండి జ్యోతుల చంటి బాబు ఇక్కడ అభ్యర్దిగా ఉన్నారు.

2014 ఎన్నికల్లో వైసిపి గెలుపు
2014 లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 198874 ఓట్లు ఉండగా ,అందులో 165417 ఓట్లు పోలయ్యాయి. వైసిపి నుండి పోటీ చేసిన జ్యోతుల నెహ్రూకు 88146 ఓట్లు రాగా, టిడిపి నుండి పోటీ చేసిన చంటిబాబుకు 72214 ఓట్లు వచ్చాయి.వైసిపి నుండి పోటీ చేసిన జ్యోతుల నెహ్రూ 15932 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ వైసిపి నుండి గెలిచిన జ్యోతుల నెహ్రూ వైసిపి వీడి టిడిపిలోకి ఫిరాయించారుద. టిడిపి నుండి పోటీ చేసిన జ్యోతుల చంటిబాబు వైసిపిలో చేరారు.












Click it and Unblock the Notifications