ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: నర్సీపట్నం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 లో నియోజకవర్గాల పునర్విభజన లో భాగంగా గోలుగొండ, నేతవరం, నర్సీపట్నం, మాకవరపాలెం మండలాలను పూర్తిగా నర్సీపట్నం లో విలీనం చేసారు. 1983 నుండి ఇక్కడ నుండి ప్రస్తుత మంత్రి చింతకాయల అయన్నపాత్రుడు అయిదు సార్లు గెలిచారు. 1989,2004 లో ఓడిపోయారు. 1996 లో ఆయన లోక్‌సభ కు ఎన్నికయ్యారు. మరో సీనియర్ నాయ కుడు సాగి సూర్యనారాయణ రాజు ఇక్కడ మూడు సార్లు, పాయకరావుపేట లో ఒకసారి గెలుపొందారు. 1962 లో ఇక్కడ గెలి చిన లచ్చాపాత్రుడు అంతకుముందు గొలుగొండ లో విజయం సాధించారు. సాగి సూర్యనారాయణ రాజు కాసు, పివి, జలగం క్యాబినెట్లలో మంత్రిగా పని చేసారు. అయ్యన్న పాత్రుడు ఎన్టీఆర్, చంద్రాబు ప్రభుత్వాల్లో మంత్రిగా చేసారు. ఇక, 2009 ఎన్నికల తరువాత ఇక్కడ కొత్త సమీకరణాలు తెర మీదకు వచ్చాయి.
14 సార్లు ఎన్నికలు జరిగితే..
ఇక్కడ మొత్తంగా 14 సార్లు ఎన్నికలు జరిగితే అందులో కాంగ్రెస్ ఆరు సార్లు గెలిచింది. టిడిపి ఏడు సార్లు గెలుపొందింది. ఒక సారి స్వతంత్ర అభ్యర్ది గెలుపొందారు. 2004 ఎన్నికల ముండు ఇక్కడి నుండి 2009 లో గెలిచిన ముత్యాల పాప వైసిపి లో చేరారు. కానీ, ఎన్నికల్లో పోటీ చేయలేదు. సినీ దర్శకుడు పూరీ జగన్నాధ్ సోదరుడు ఉమా శంకర్ వైసిపి లో చేరి 2014 ఎన్నికల్లో పోటీ చేసారు.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు
2014 ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 193579 ఓట్లు ఉంటే, అందులో 162437 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన అయ్యన్న పా త్రుడుకు 79726 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన ఉమా శంకర్ కు 77388 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్ది అయ్యన్న పాత్రుడు 2338 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ గెలిచిన అయ్యన్న పాత్రుడు చంద్రాబు ప్రభు త్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు.












Click it and Unblock the Notifications