ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పోల‌వ‌రం (ఎస్టీ) నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా పోల‌వ‌రం, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం మండ‌లాలు అలాగే కొన‌సా గుతున్నాయి. కొత్త‌గా టి న‌ర‌సాపురం మండ‌లం, కొయ్య‌ల గూడెం మండ‌లం పూర్తిగా ఇక్క‌డే క‌లిపారు. ఈ నియోజ‌క‌వ ర్గం లో టిడిపి నేత ముడియం ల‌క్ష్మ‌ణ‌రావు, తెల్లం బాల‌రాజులు మాత్ర‌మే రెండేసి సార్లు గెలుపొందారు. 1999 లో టిడిపి అభ్య‌ర్ది వంకా శ్రీనివాస‌రావు అతి త‌క్కువ‌గా 24 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన తెల్లం బాల‌రాజు మాజీ ఎమ్మెల్యే సింగ‌న్న దొర పై గెలుపొందారు. 2004 లో సైతం బాల‌రాజు కాంగ్రెస్ నుండి ఇక్క‌డ గెలిచారు.

14 సార్లు ఎన్నిక‌లు జ‌రిగితే..
పోల‌వ‌రం నియోక‌వ‌ర్గం లో ఇప్ప‌టి వ‌రకు 14 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. అందులో కాంగ్రెస్ ఏడు సార్లు, టిడిపి అయి దు సార్లు, సిపిఐ ఒక‌సారి, స్వ‌తంత్ర అభ్య‌ర్ది ఒక‌సారి గెలుపొందారు. 2009 ఎన్నిక‌ల్లో గెలిచిన బాల‌రాజు వైయ‌స్ మ‌ర‌ణం త‌రువాత జ‌రిగిన రాజ‌కీయా ప‌రిణామాల్లో జ‌గ‌న్ కు మ‌ద్ద‌తుగా నిలిచారు. కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అవిశ్వాసంలో ఓటింగ్ లో పాల్గొన‌టంతో ఆయ‌న పై అన‌ర్హ‌త వేటు ప‌డింది. దీంతో..2012 లో ఉప ఎన్నిక లు జ‌ర‌గ్గా..ఆయ‌న టిడిపి అభ్య‌ర్ది ముడియం శ్రీనివాస‌రావు పై గెలుపొందారు.

AndhraPradeshElections2019: All about Polavaram (ST) Constituency

2014 ఎన్నిక‌ల్లో..
2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ మొత్తం 190801 ఓట్లు ఉండ‌గా, అందులో 164079 ఓట్లు పోల‌య్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన ముడియం శ్రీనివాస్ కు 83767 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన బాల‌రాజు కు 68047 ఓట్లు వ‌చ్చాయి. టిడిపి అభ్య ర్ది ముడియం శ్రీనివా స్ 15720 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+