ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పులివెందుల నియోజకవర్గం గురించి తెలుసుకోండి
ఏపి రాజకీయాల్లో ఈ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్.. నేటి ప్రతిపక్ష నేత , వైసి పి అధినేత జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోకవర్గం పులివెందుల. 2009 నియోజకవర్గాల పునర్విభజన తరువాత చక్రా యపేట, వేంపల్లి మండలాలతో పాటుగా ఇడుపులపాయ గ్రామం ఈ నియోజకవర్గంలో చేరింది. అదే ఇడుపుల పాయలో వైయస్ వ్యవసాయ క్షేత్రం..అందులోనే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి స్మృతి వనం ఉంది. ఇక, పులివెం దుల నియోకవర్గం వైయస్ కుటంబానికి రాజకీయంగా కంచుకోట. ఇక్కడి నుండి వైయస్ కుటుంబ సభ్యులే 1978 నుండి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఇక్కడి నుండి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వైయస్సార్ రెండు సార్లు పిసిపి చీఫ్ గా, ప్రతిపక్ష నేతగా, రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసారు. 2009 సెప్టెంబర్ 2న జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో వైయస్ మరణించారు. ఆ తరువాత వైయస్ సతీమణి విజయమ్మ, 2014 లో కుమారుడు జగన్ అక్కడి నుండి ఎమ్మెల్యేలుగా గెలి చారు. జగన్ 2014 ఎన్నికల్లో ఇక్కడి నుండే గెలిచి అసెంబ్లీ లో కాలు పెట్టారు.
16 సార్లు ఎన్నికలు.. వైయస్ కుటుంబ సభ్యులే గెలుస్తూ..
పులివెందుల నియోజకవర్గం 1955 లో ఏర్పాటైంది. ఇప్పటి వరకు అక్కడ 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 12 సార్లు, వైసిపి మూడు సార్లు, స్వతంత్ర అభ్యర్ధి ఒక సారి గెలుపొందారు. 1978 నుండి వైయస్ కుటుంబ సభ్యు లే గెలుస్తూ వచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ ఇక్కడ నుండే ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా, ప్రతిపక్ష నేతగా, రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఇదే నియోజకవర్గ ఎమ్మెల్యేగా సాధించారు. వైయస్సార్ సోదరులు వివేకానంద రెడ్డి రెండు సార్లు, పురుషోత్తమ రెడ్డి ఒక సారి గెలిచారు. ఇక, వైయస్ మరణం తరువాత ఆయన భార్య విజయమ్మ 2009 లో జరిగిన ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2012 లో జరిగిన ఉప ఎన్నిక లో గెలిచి వైసిపి నుండి గెలిచిన తొలి ఎమ్మెల్యేగా రికార్డు సాధించారు. 2014 ఎన్నికల్లో వైయస్ తనయుడు జగన్ వైసిపి నుండి గెలుపొందారు.

2014 ఎన్నికలో 80 శాతం పోలింగ్.. జగన్ గెలుపు..
2014 లో జరిగిన ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 225212 ఉండగా, అందులో 179698 ఓట్లు పోలయ్యాయి. 88608 పురుష ఓట ర్లు కాగా, మహిళా ఓటర్లు 91090 ఓటర్లుగా నమోదయ్యారు. 2014 ఎన్నికల్లో 79.79 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ ఎన్నిక ల్లో వైసిపి అధినేత జగన్మహన రెడ్డికి 124576 ఓట్లు రాగా, టిడిపి అభ్యర్ది సతీష్ రెడ్డికి 49333 ఓట్లు దక్కాయి. వైయస్ కుటుంబం పై వరుసగా నాలుగు సార్లు టిడిపి నుండి సతీష్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత 2014 లో టిడిపి అధికారంలోకి రావటంతో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ గా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో పులివెందుల నుండి జగన్ కు 75243 ఓట్ల మెజార్టీ దక్కింది.












Click it and Unblock the Notifications