ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: రామచంద్రాపురం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఇప్పటికే ఉన్న రామచంద్రాపురం, పామర్రు మండలాలు అలాగే కొనసాగు తుండగా, పునర్విభజనలో రద్దయిన తాళ్లరేవు నియోకవర్గంలోని కాజులూరు మండలం కొత్తగా చేరింది.ఈ నియోజకవర్గం లో పిల్లి సుభాష్ చంద్రబోస్ నాలుగు సార్లు, తోట త్రిమూర్తులు మూడు సార్లు గెలుపొందారు. 2009 లో తోట త్రిమూర్తులు ప్ర జారాజ్యం నుండి పోటీ చేసి ఓడారు. 1989 లో కాంగ్రెస్ అభ్యర్దిగా గెలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్ 2004 ఎన్నికల్లో స్వతం త్ర అభ్యర్దిగా గెలిచి కాంగ్రెస్ లో చేరారు. ఆయన వైయస్, రోశయ్య ప్రభుత్వాల్లో మంత్రిగా పని చేసారు. జగన్ కోసం కాంగ్రెస్ పార్టీని వీడి వైసిపి లో చేరారు. ప్రజారాజ్యం నుండి పోటీ చేసిన తోట త్రిమూర్తులు తిరిగి 2012 లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసి తిరిగి టిడిపి గూటికి చేరారు.
16 సార్లు ఎన్నికలు జరిగితే..
ఇక్కడ మొత్తంగా 16 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ నాలుగు సార్లు, టిడిపి నాలుగు సార్లు, సిపిఐ, ప్రజాపార్టీ , కెఎమ్‌పిపి ఒక్కొక్క సారి గెలిచాయి. స్వతంత్ర అభ్యర్దులు అయిదు సార్లు గెలుపొందారు. 2014 ఎన్నికల నాటికి ఈ నియో జకవర్గంలో సమీకరణాలు మారిపోయాయి. 1999 నుండి ముఖాముఖి తలపడుతున్న ఇద్దరు అభ్యర్దులే తిరిగి 2014 ఎన్నిక ల్లోనూ పోటీ పడ్డారు.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు..
2014 ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 181646 ఓట్లు ఉండగా, అందులో 159164 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన తోట త్రిమూ ర్తులు 85254 ఓట్లు దక్కించుకోగా, వైసిపి నుండి పోటీ చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్ కు 68382 ఓట్లు వచ్చాయి. టిడిపి నుండి బరి లో ఉన్న తోట త్రిమూర్తులు 16922 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.












Click it and Unblock the Notifications