ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: యర్రగొండపాలెం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పుల్లలచెరువు, త్రిపురాంతకం మండలాలు పూర్తిగా ఈ నియోజకవర్గం లో చేరాయి.తొలుత 1955 నుండి 1972 వరకరు ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఉండేది. ఆ తరువా రద్దు అయింది. తిరిగి 2009 లో పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం తిరిగి ఏర్పడింది. అంతుకు ముందు ఉన్న కంభం నియోజకవర్గం 200వ రకు ఉండి..2009 లో రద్దు అయింది. కంభం నుండి పిడతల రంగారెడ్డి ఒకసారి, గిద్దలూరు నుండి నాలుగు సార్లు గెలిచారు. కంభంలో ఒకసారి గెలిచిన కందుల ఓబుల్‌రెడ్డి, మూడు సార్లు గెలిచిన నాగార్జునరెడ్డి తండ్రి, కుమారులు. ఇక్క డ నుండి గెలిచిన పిడతల రంగారెడ్డి శాసనసభ స్పీకర్ గా..మంత్రిగా..పిసిసి అధ్యక్షుడిగా పని చేసారు.
ఎర్రగొండపాలెం లో
తొలుత 1955 నుండి 1972 కాలంలో ఉన్న ఈ నియోజకవర్గంలో ఒక ఉప ఎన్నిక తో సహా అప్పుడు అయిదు ఎన్నికలు జరి గాయి. కాంగ్రెస్ నాలుగు సార్లు గెలిస్తే రెండు సార్లు సిపిఐ గెలిచింది. ప్రముఖ నేత కందుల ఓబుల రెడ్డి ఇక్కడి నుండి ఒక సారి, కంభం నుండి ఒకసారి, మార్కాపురం నుండి రెండు సార్లు విజయం సాధించారు. సిపిఐ నేత పూల సుబ్బయ్య ఎర్ర గొండపాలెంలో రెండు సార్లు, మార్కాపురం లో ఒకసారి నెగ్గారు. ఎర్రగొండ పాలెంలో జంకె రామిరెడ్డి, మార్కాపురం లో ఒక సారి గెలిచిన వెంకటరెడ్డి తండ్రీ కొడుకుల. ఇక, 2009 లో తిరిగి ఏర్పడిని ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ గెలవగా.. 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి ఇక్కడి నుండి విజయం సాధించారు.

2014 ఎన్నికల్లో..
2014 ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 188593 ఓటర్లు ఉండగా, అందులో 157182 మంది ఓటు హక్కు వినియోగించుకున్నా రు. వైసిపి నుండి పోటీ చేసిన పాలపర్తి డేవిడ్ రాజుకు 85774 ఓట్లు రాగా, టిడిపి నుండి పోటీ చేసిన అజిత్ రావు కు 66 703 ఓట్లు వచ్చాయి. వైసిపి అభ్యర్ధి డేవిడ్ రాజు 19701 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ వైసిపి అభ్యర్ధిగా గెలు పొం దిన డేవిడ్ రాజు ఆ తరువాత కొంత కాలానికే టిడిపిలోకి ఫిరాయించారు. ప్రస్తుతం టిడిపి సభ్యుడిగా కొనసాగుతున్నా రు. డేవిడ్ రాజు గతంలో జడ్‌పి ఛైర్మన్‌గా..సంతనూతలపాడు ఎమ్మెల్యే గా పని చేసారు.












Click it and Unblock the Notifications