లోకేష్ హైలెట్: మహానాడుకు పవన్ (పిక్చర్స్)
హైదరాబాద్: నరేంద్ర మోడీ ప్రభుత్వం చేరిన తెలుగుదేశం పార్టీకి ఈ ఏడాది కీలకం కానుంది. అదే సమయంలో రాష్ట్ర విభజన కూడా మహానాడు సమావేశాల్లో ప్రధానం కానుంది. ప్రతి ఏటా నిర్వహించే మహానాడును సీమాంధ్రలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తరుణంలో ఈసారి జరుగుతున్నాయి. దీంతో తెలుగు తమ్ముళ్లలో ఉల్లాసం చోటు చేకుంది.
హైదరాబాద్ గండిపేటలోని ఎన్టీఅర్ కుటీర్ లో జరుగనున్న ‘మహానాడు'కి బారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 27, 28 తేదీలలో జరుగబోయే ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మహానాడు తెలుగుదేశం నేతల పండుగని, 1983 నుంచి మహానాడును టీడీపీ ఆనవాయితీగా జరుపుకుంటోందని తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్ల రామయ్య శుక్రవారం మీడియా సమావేశంలో తెలిపారు.
ఈసారి జరుగబోయే ‘మహానాడు' ఉమ్మడి రాష్ట్రంలో ఆఖరిది కావడంతో భారీ స్థాయిలో నిర్వహిస్తామని వర్ల రామయ్య అన్నారు. అయితే ఈ మహానాడులో రెండు రాష్ట్రాలకు విడివిడిగా అధ్యక్షులను ఎన్నుకుంటారని కొందరు, రెండు రాష్ట్రాలకు చంద్రబాబు నాయుడినే అధ్యక్షుడుగా ఎన్నుకొంటారని మరి కొందరు అంటున్నారు.
మహానాడుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించే అవకాశం ఉంది. పోస్టర్లపై ఆయన చిత్రాన్ని కూడా ముద్రించారు. అదే సమయంలో నారా లోకేష్ ఈ మహానాడులో హైలెట్ కానున్నారు.

మహానాడు ఏర్పాట్లు
సీమాంధ్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న తరుణంలో గండిపేటలో విస్తృతమైన ఏర్పాట్లు జరిగాయి.

పోస్టర్లపై పవన్ కళ్యాణ్ కూడా..
మహానాడు పోస్టర్లపై చంద్రబాబు, బాలకృష్ణ చిత్రాలతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రాన్ని కూడా ప్రచరించారు.

పవన్ కళ్యాణ్ హైలెట్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతులు కలిపిన చిత్రం హైలెట్ కానుంది.

ఎన్టీఆర్ చిత్రాలు..
ఎన్టీ రామారావు వివిధ చిత్రాల్లో వేసిన పౌరాణిక చిత్రాల్లోని పాత్రల ఛాయాచిత్రాలు మహానాడులో కనువిందు చేయనున్నాయి.

నారా లోకేష్ చిత్రం కూడా..
మహానాడులో చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ ఛాయాచిత్రాన్ని పెడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ముప్పు తప్పడంతో ఇందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

భారీ ఏర్పాట్లు..
తెలుగుదేశం పార్టీ మహానాడుకు గండిపేటలో విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వాటిని నాయకులు ప్రతి రోజూ పరిశీలిస్తున్నారు.












Click it and Unblock the Notifications