ప్రధాని అభ్యర్థి: మోడీ ముందు సవాళ్లు

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి, 2014 ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీని ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ప్రకటించారు. పార్టీ అగ్రనేత లాల్‌కృష్ణ అద్వానీ, సుష్మా స్వరాజ్ నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ రాజ్‌నాథ్ పార్టీలోని మిగితా ప్రముఖ నేతలందరి ఆమోదంతో మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు.

అయితే సీనియర్ నేత సుష్మా స్వరాజ్.. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే సమయంలో ఆయన పక్కనే కూర్చోవడం చూస్తే ఆమె కూడా మోడీ అభ్యర్థిత్వానికి మద్దతు పలికినట్లుగా తెలుస్తోంది. ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నరేంద్ర మోడీ మాట్లాడుతూ..తనకు ఎల్లప్పుడూ పార్టీ అగ్రనేతలు వాజ్ పేయి, అద్వానీల ఆశీస్సులుంటాయని చెప్పడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని అభ్యర్థిగా ఎన్నికైన మోడీ పెద్ద సవాళ్లనే ఎదుర్కొవాల్సి ఉంది.

Narendra Modi and Rajnath Singh

ఏది ఏమైనప్పటికీ దేశంలో విస్తృత ప్రజాదరణ గల పార్టీ నేతల్లో ముందున్న నరేంద్ర మోడీని బీజేపీ తమ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో పార్టీ నేతల్లో, కార్యకర్తల్లోనూ ఉత్సాహం నెలకొంది. మోడీని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించడం పార్టీలో నూతన శకానికి నాంది పలికినట్లుగా తెలుస్తోంది. కాగా మోడీ ప్రధానంగా మూడు పెద్ద సవాళ్లను ఎదర్కొవాల్సి ఉంది.

పార్టీలో అంతర్గత భేదాభిప్రాయాలు

మోడీ ముందున్న సవాళ్లలో మొదటిది బీజేపీలో తన ప్రధాని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన పార్టీ ముఖ్య నేతలను ఎలా సానుకూలంగా మార్చుకుంటారనేది. పార్టీలో తన అభ్యర్థిత్వం పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తం చేసిన అద్వానీ, సుష్మా స్వరాజ్‌లను తన వైపు తిప్పుకోవడంలో మోడీ సఫలం కావాల్సి ఉంది. లేదంటే మోడీ ఒక వేళ ప్రధాని అయినప్పటికీ ఆ నేతల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు. పార్టీ నేతలందర్ని మోడీ తనవైపు తిప్పుకుని ముందుకెళితే పార్టీకి గెలుపు అవకాశాలను మెరుగుపర్చవచ్చు. కర్నాటక బీజేపీకి రాజీనామా చేసి వేరే పార్టీ పెట్టిన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను తిరిగి పార్టీలోకి తీసుకోవడం ద్వారా ఆ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే బాధ్యత కూడా మోడీపైనే ఉంది.

కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొవడం

బీజేపీ ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి వచ్చే అరోపణలకు మోడీ గట్టి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. బీజేపీ అంతర్గాత విభేదాలను కూడా కాంగ్రెస్ పార్టీ తన అస్త్రంగా మార్చుకునే అవకాశం లేకపోలేదు. వచ్చే ఎన్నికల్లో ప్రధాని మన్మోహన్ సింగ్‌కు బదులు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. మోడీపై విమర్శలు కురిపించేందుకు కాంగ్రెస్ నేతలు వంజారా కేసు లాంటి వాటిని ఆసారాగా చేసుకోవచ్చు.

మిత్ర పక్షాల మద్దతు కూడగట్టడం

నరేంద్ర మోడీకి మూడోది, అతి ప్రధానమైన సవాల్ ఏమిటంటే బీజేపీ మిత్ర పక్షాలను పెంచుకోవడం. పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రాంతీయ పార్టీల మద్దతు కూడా చాలా అవసరం. ఒకవేళ బీజేపీ 170 నుంచి 180 సీట్లు గెలుచుకుంటే అప్పుడు తప్పక ప్రాంతీయ పార్టీల మద్దతు పొందాల్సి ఉంటుంది. మోడీ తన చాకచక్యంతో ప్రాంతీయ పార్టీలను, మిత్ర పక్ష పార్టీలను తనవైపు తిప్పికున్నట్లయితే లక్ష్యాన్ని సాధించడంలో సఫలీకృతమయ్యే అవకాశాలు లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+