అధిష్టానానికి కిరణ్ ట్విస్ట్: సభ కష్టమే, ప్రతివ్యూహం
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లును తిప్పి పంపాలంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభాపతికి నోటీసు ఇచ్చిన నేపథ్యంలో సోమవారం నుండి సభ సాగుతుందా? అనే ఉత్కంఠ కలుగుతోంది. బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టేందుకు సిఫార్సు చేయవద్దని రాష్ట్రపతికి విన్నవిస్తూ తీర్మానించాలని కిరణ్ అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో రేపటి నుండి సభ జరగడం కష్టంగా ఉండనుందంటున్నారు.
కిరణ్ బౌన్సర్‌తో అధిష్టానం షాక్‌కు గురైందనే చెప్పవచ్చు. కాంగ్రెస్ అధిష్టానం తదుపరి కర్తవ్యంపై దృష్టి పెట్టింది. సిఎం నిర్ణయంతో సంబంధం లేకుండా బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించే అంశంపై దృష్టి సారిస్తోంది. ఫిబ్రవరి 5నుంచి పార్లమెంటు భేటీ ప్రారంభమైనా, రెండోవారంలోనే బిల్లును ప్రతిపాదించవచ్చని ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి. జనవరి 30 తరువాత బిల్లు ఢిల్లీకి చేరితీరాలని కాంగ్రెస్ హైకమాండ్ సిఎంను ఆదేశించే అవకాశాలు ఉన్నాయి.

అయితే రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నిక కావాల్సిన పార్టీ అభ్యర్థులు విజయం సాధించాలంటే గడువును మరికొంత పొడగించక తప్పదని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తుండటం హైకమాండ్‌ను ఇరుకునపడేసింది. మరోపక్క హైకమాండ్‌కు గుణపాఠం చెప్పాలన్న పట్టుదలతో సొంత పార్టీ ఎమ్మేల్యేలు రాజ్యసభ ఎన్నికల బరిలో దిగాలని తీసుకున్న నిర్ణయం పరిస్థితిని మరింత జఠిలం చేస్తోంది. తాజాగా కిరణ్ నోటీసుతో మరో షాక్ ఇచ్చారు. అయితే, వీటన్నింటిని పక్కన పెట్టి అధిష్టానం ముందుకెళ్లే అవకాశముందంటున్నారు.
ఇక, ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసు ట్విస్టుతో ఇక సభ సాగుతుందా? చర్చ కొనసాగుతుందా? అనేవి ఆసక్తికరంగా మారింది. స్పీకర్‌కు సిఎం నోటీసు ఇవ్వగానే తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు పార్టీలకతీతంగా భేటీ అయ్యారు. ఆ భేటీలోనే సోమవారం నుంచి సభను అడ్డుకోవాలని తెలంగాణ నేతలు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సభను సజావుగా జరిగేలా చేస్తే కిరణ్ ఇచ్చిన నోటీసును స్పీకర్ సభ దృష్టికి తెచ్చే వీలుందని తెలంగాణ ప్రజా ప్రతినిధులు భావిస్తున్నారు.
ఇదే జరిగితే సోమవారం బిఎసి సమావేశం నిర్వహించి తీర్మానాన్ని ఎప్పుడు చర్చకు చేపట్టాలో ఓటింగ్‌ను ఎప్పుడు నిర్వహించాలన్న అంశంపై తీర్మానం చేసే వీలుందని, 77వ నిబంధన మేరకు శాసనసభ్యుడు గాని, మంత్రిగాని ఏదైనా బిల్లుపై అభ్యంతరాలను పది రోజుల ముందుగా ఇవ్వాల్సి ఉంటుందని కాని శాసనసభా నాయకుడే నోటీసును ఇచ్చినప్పుడు దానిని కచ్చితంగా స్పీకర్ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని రాజ్యంగ నిపుణులు చెబుతున్నారు.
సభానాయకుడిగా కిరణ్ ఇచ్చిన నోటీసును సోమవారం సభ దృష్టికి తీసుకువచ్చి, బిఎసి సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంటుందంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలకు తావివ్వకుండా సభా వ్యవహారాలను అడ్డుకోవాలన్న యోచనలో తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఉన్నారు. సోమవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకూ సభా కార్యక్రమాలను అడ్డుకోగలిగితే బిల్లును కేంద్రానికి పంపించడం మినహా మరో గత్యంతరం ఉండదంటున్నారు.
మరోవైపు శనివారం ముఖ్యమంత్రి ప్రసంగం సభ్యుల అభ్యంతరాల తర్వాత సభ వాయిదా పడడంతో సోమవారం యథాతథంగా జరుగుతుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత తెరాస నేతలు కె కేశవ రావు, ఈటెల రాజేందర్, ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి, టిటిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్‌రావులు సోమవారం నుంచి శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
అంతకుముందు ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి, బిజెపి అనుబంధ సభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డిలతో కలిసి తెరాస సభ్యులు ఈటెల, కల్వకుంట్ల తారక రామారావులు స్పీకర్‌ని కలిశారు. సిఎం ఇచ్చిన లేఖ ఏమిటని ఆరా తీశారు. ప్రభుత్వం తరఫున నోటీసు ఇచ్చారా? ఒకవేళ ప్రభుత్వం తరఫున నోటీసు ఇస్తే, తెలంగాణ మంత్రులు కూడా అందులో భాగమే అవుతారన్నారు. అలాంటప్పుడు వారు సిఎం ఇచ్చిన లేఖకు ఆమోదం తెలిపారా? అంటూ ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలోనే సమావేశమై తుది కార్యాచరణను ఖరారు చేయాలని తెలంగాణ నేతలు తీర్మానించారు. ఇదే సమయంలో ఆదివారం మంత్రి జానారెడ్డి ఢిల్లీ వెళ్లి పెద్దలను కలవాలన్న యోచనలో ఉన్నారు.
కెకె, గండ్ర తదితరులు స్పీకర్‌కు సిఎం ఇచ్చిన లేఖకు సంబంధించి నిబంధనలు ఎలా ఉన్నాయో పరిశీలించారు. ఇందుకోసం రాజ్యాంగంతోపాటు, అసెంబ్లీ నిబంధనల పుస్తకాలు తెప్పించి అధ్యయనం చేశారు. సోమవారం బిఎసి జరిగితే కేవలం బిఎసి సభ్యులతో మాత్రమే సమావేశం జరగాల్సి ఉంటుందని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకూ బిఎసి సభ్యులు కాని వారు హాజరైనప్పటికీ సభాపతి చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇకపై కఠినంగా ఉండాలన్న అభిప్రాయానికి వచ్చారట.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications