లోకేష్ ఫోటో చించి, జూఎన్టీఆర్ కావాలని:ఫైట్(పిక్చర్స్)

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమకు టిక్కెట్లు దక్కలేదని వివిధ పార్టీలకు ఆశావహులు తమ తమ పార్టీ అధిష్టానాల పైన మండిపడుతున్నారు. అధికార తెరాస, బిజెపి, కాంగ్రెస్, టిడిపిలు.. ఇలా అన్ని పార్టీల పరిస్థితి అలాగే ఉంది.

బుధవారం నాడు తమకు టిక్కెట్ దక్కలేదని కొందరు టిఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు ఎన్టీఆర్ భవన్‌ను ముట్టడించారు. తమకు టిక్కెట్ దక్కలేదనే ఆగ్రహంతో వారు ఓ కొత్త వాదాన్ని తెరపైకి తీసుకు వచ్చారు. తెలంగాణ బాధ్యతలు జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇక గాంధీ భవన్లో అయితే ఫైటింగ్ జరిగింది.

అసంతృప్తి ప్రభావం టిడిపి నుంచి ఓ టిఎన్ఎస్ఎఫ్ నేతను సస్పెండ్ అయ్యేలా చేసింది. టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డిని టిడిపి నుంచి సస్పెండ్‌ చేసినట్లు సమాఖ్య జాతీయ ఇంఛార్జి మదన్‌మోహన్ రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డికి బంధువైన శ్రీకాంత్ రెడ్డి అక్బర్ బాగ్‌ డివిజన్‌ టిక్కెట్‌ను ఆశించారని, కానీ అక్కడ పార్టీ చేసిన సర్వేలో అతను మూడో స్థానంలో ఉన్నట్లు తేలిందని, గత 6నెలలుగా అతను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని, వాస్తవ పరిస్థితులను పట్టించుకోకుండా పార్టీ కేంద్రం కార్యాలయంలో ఫ్లెక్సీలు చించేసి గొడవ చేశారని వివరించారు. టిక్కెట్లు ఇవ్వడానికి అభ్యర్థుల ఎంపిక నిష్పక్షపాతంగా జరిగిందన్నారు.

అంతకుముందు బుధవారం నాడు టిక్కెట్లు అమ్ముకుంటున్నారని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎదుట శ్రీకాంత్ రెడ్డి మెరుపు ఆందోళనకు దిగారు. అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కటౌట్లను చించివేశారు.

టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు మాగంటి గోపినాథ్‌లపై తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రేటర్ బరిలో వారిద్దరూ టికెట్లను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఈ ఆందోళన జరిగిన కాసేపటికే శ్రీకాంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు టీఎన్ఎస్ఎప్ ఇంచార్జీ మదన్ మోహన్ రావు ప్రకటించారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్

తెలంగాణ టిడిపి నేతలు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తూ టిఎన్ఎస్ఎఫ్ నేతలు బుధవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎదుట ఆందోళనకు దిగారు.

గాంధీ భవన్

గాంధీ భవన్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిక్కెట్ల కోసం గాంధీ భవన్లో బుధవారం నాడు రగడ జరిగింది. నాయకులు ఒకరినొకరు తోసుకున్న దృశ్యం.

గాంధీ భవన్

గాంధీ భవన్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిక్కెట్ల కోసం గాంధీ భవన్లో బుధవారం నాడు రగడ జరిగింది. వాదులాడుకుంటున్న ఇరువురు నేతలు.

గాంధీ భవన్

గాంధీ భవన్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిక్కెట్ల కోసం గాంధీ భవన్లో బుధవారం నాడు రగడ జరిగింది. నేతల వాగ్యుద్ధం దృశ్యం.

గాంధీ భవన్

గాంధీ భవన్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిక్కెట్ల కోసం గాంధీ భవన్లో బుధవారం నాడు రగడ జరిగింది. టిక్కెట్ కోసం గాంధీ భవన్లో హంగామా.

గాంధీ భవన్

గాంధీ భవన్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిక్కెట్ల కోసం గాంధీ భవన్లో బుధవారం నాడు రగడ జరిగింది. టిక్కెట్ కోసం గాంధీ భవన్లో హంగామా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+