వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టి: బిజెపిలో కెసిఆర్, సుష్మా వ్యాఖ్యల చిచ్చు

By Srinivas
|
Google Oneindia TeluguNews

T: differences in AP BJP
భారతీయ జనతా పార్టీలో విభజన సెగలు రాజుకున్నాయి. ఇరు ప్రాంతాలలో తెలంగాణవాదం వినిపిస్తున్న బిజెపిలో తొలిసారి సెగ రాజుకుంది! పాలమూరు సభలో పార్టీ అగ్రనేత సుష్మా స్వరాజ్ వ్యాఖ్యలు, నిజాం కళాశాలలో జరిగిన సకల జన భేరీ సభలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఇతర నేతలు సీమాంధ్రులను తూలనాడటంపై అదే వేదిక పైనున్న బిజెపి నేతలు పెదవి విప్పక పోవడం అంశాలు ఆ పార్టీలోని సీమాంధ్ర నేతల్లో ఆగ్రహాన్ని కలిగించాయి. ఇటీవల పాలమూరు సభలో పాల్గొన్న సుష్మా స్వరాజ్ తెలంగాణ ఇవ్వకుంటే తానే ఉద్యమంలో పాల్గొంటానని చెప్పారు.

అదే సమయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిని కలిసే విషయమూ ఇరు ప్రాంతాల నేతల మధ్య విభేదాలకు కారణమైంది. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సోమవారం రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం జరిగింది. పార్టీ రామారావు, శేషగిరి రావు, ఇంద్రసేనా రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్యేలు నాగం జనార్దన్ రెడ్డి, లక్ష్మీ నారాయణ, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సకల జన భేరిలో కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్చ జరిగింది.

ఆంధ్రోళ్లంతా తెలంగాణ ద్రోహులేనన్న కెసిఆర్ వ్యాఖ్యలపై సీమాంధ్ర నేతలు మండిపడ్డారు. తెలంగాణకు అనుకూలంగా బిజెపి నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని, సీమాంధ్రలో పార్టీ కార్యాలయాలపై దాడులు జరుగుతున్నా, పార్టీ సమావేశాలను అడ్డుకుంటున్నా భౌతిక దాడులకు పాల్పడుతున్నా పార్టీ నిర్ణయాన్ని ఎదిరించలేదని, అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్, నరేంద్ర మోడీలు తెలంగాణలోనే పర్యటించినా సర్దుకుపోయామని కానీ, కెసిఆర్ వ్యాఖ్యలతో తమ ప్రాంతంలో మరిన్ని అలజడులు రేగుతున్నాయని చెప్పారు.

ఆయన వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే కాకినాడ తదితర చోట్ల బీజేపీ కార్యాలయాలపై సమైక్యవాదులు దాడులు చేశారన్నారు.
సీమాంద్రులను రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేస్తున్న కెసిఆర్‌తో పార్టీ నేతలు వేదికను ఎలా పంచుకుంటారని ప్రశ్నించారు. ఆంధ్రోళ్లంతా ద్రోహులే అని విమర్శిస్తుంటే పార్టీ నేతలు ఎందుకు ఖండించలేదన్నారు. అలాంటి నేతతో భవిష్యత్తులో వేదికను పంచుకోవద్దని కరాఖండిగా తేల్చి చెప్పారు. సీమాంధ్రలో పార్టీ కార్యాలయాలపై జరుగుతోన్న దాడులను ఎందుకు పట్టించుకోవడం లేదని పార్టీ అధ్యక్షుడిని నిలదీశారు.

దీంతో, బిజెపి ఇప్పటికే తెలంగాణ ఐకాసలో భాగస్వామ్య పార్టీ అని, అలాంటప్పుడు ఐకాస ఆహ్వానిస్తే వెళ్లకుండా ఎలా ఉంటామని చెప్పారు. తెలంగాణ సాకారమవుతున్న వేళ ప్రతి వేదికపైనా పార్టీ వాణిని వినిపించాల్సిన అవసరం ఉందని, అప్పుడే పార్టీకి తెలంగాణలో ఆదరణ పెరుగుతుందని వాదించారు. పార్టీ జాతీయ నేతలను కలిసి సమస్యలు వినిపించే విషయంపైనా ఇరు ప్రాంతాల నేతల మధ్య విభేదాలు తలెత్తాయి.

ఇరు ప్రాంతాల నేతలకు రాజ్‌నాథ్‌సింగ్ బుధవారం అపాయింట్‌మెంట్ ఇచ్చారు. కోర్ కమిటీ భేటీలో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. సీమాంధ్ర సమస్యలను పరిష్కరించిన తర్వాతే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే పార్టీ మద్దతు ఇవ్వాలని ఆ ప్రాంత నేతలు జాతీయ నాయకులను కోరాలని అనుకున్నారు. కానీ, పార్లమెంటులో బిల్లుకు బేషరతుగా మద్దతు ఇస్తామని రాష్ట్ర, జాతీయ నేతల పలుమార్లు ప్రకటించారని, ఇప్పుడు కండీషన్లు పెడితే ఎలా అని తెలంగాణ నేతలు ప్రశ్నించారు.

ఇరు ప్రాంత నేతల వాదనతో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర మనస్తాపం చెందారు. అటు సీమాంద్ర నేతలు తననే తప్పుపడుతున్నారు, ఇటు తెలంగాణ నేతలు పట్టు విడవడం లేదని ఇలాంటి పరిస్థితిలో అధ్యక్షుడిగా కొనసాగలేనని, పార్టీని మీరే నడుపుకోండని తీవ్రంగానే స్పందించారు. ఒక దశలో రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారట.

English summary
The Seemandhra BJP leaders questioned Telangana leaders and state president Kishan Reddy in state meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X