కోట్లలో కరెంటు బిల్లు..అధికారులకే షాక్..
సాధారణంగా కరెంట్ బిల్లు నెలకు ఎంత వస్తుంది. 500 రూపాయలు నుంచి 700 రూపాయల వరకూ రావడం సహజమే. అది కూడా ఇంట్లో టీవీ, ఫ్రీడ్జ్‌లు, వాషింగ్ మెషీన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు వాడితే.. ఇక ఎసీ వంటి ఎలక్ట్రానిక్ వస్తువు వాడితే మాత్రం నెలకు 1000 రూపాయల నుంచి 2000 రూపాయలకు వరకు వస్తుంది. కానీ, ఆంధ్రప్రదేశ్‌లోని ఓ దుకాణానికి మాత్రం విద్యుత్ బిల్లు ఏకంగా కోట్లలో వచ్చింది.
ఈ విషయం విద్యుత్ అధికారులనే షాక్‌కి గురి చేసింది. ఇలాంటి సంఘటనలు ఈ రాష్ర్టానికి కొత్తేమీ కాదు. ఎందుకంటే, గత మూడు నాలుగు నెలల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ బిల్లుల మోతలు ఎక్కువయిపోయాయి. పలుప్రాంతాల్లో నెలనెలకు అధికారుల నిర్లక్ష్యాల వల్ల కరెంటు మోతలు పెరిగిపోతున్నాయని అని చాలామంది గగ్గోలు పెడుతున్నారు. ఎన్నిసార్లు ఈ సమస్యపై చర్యలు తీసుకున్నా... మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృత్తం అవుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి సంఘటన మరోకటి వెలుగులో వచ్చింది. శ్రీకాకులంలోని ఓ షాప్‌కి వచ్చిన విద్యుత్ బిల్లును చూసి ఆ యజామాని షాక్‌కి గురయ్యాడు.

ఏకంగా కోట్లలో...:ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఒక షాపు యజమాని కోటి రూపాయలకు పైగా విద్యుత్ బిల్లు రావడంతో షాక్‌కు గురయ్యాడు. ఎపిలోని కొత్తూరు మండలంలోని పాలకొండ రోడ్డులోని ఓ జ్యూయలర్స్ షాప్‌కి ఏకంగా రూ. 1,01,56,116 విద్యుత్తు బిల్లు వచ్చింది. ఆ షాప్ యజమాని పేరు గుడ్ల అశోక్. ఈ బిల్లు గత నెల అంటే సెప్టెంబర్ 2వ తేది నుంచి అక్టోబర్ 2వ తేదివరకు తీసిన రీడింగ్‌కు సంబంధించినదని దుకాణ యజమాని గుడ్ల అశోక్ తెలిపారు. వెంటనే ఆయన ఈ బిల్లును విద్యుత్తు సిబ్బందికి అందించారు.
ఈ బిల్లును చూసి విద్యుత్ అధికారులు ఖంగుతిన్నారు. వెంటనే సంబంధింత అధికారులకు ఫిర్యాదు చేశారు. బిల్లును పరిశీలించి కొత్త బిల్లు ఇస్తామని యజమానికి హామి ఇచ్చారు అధికారులు. గతంలో నెలకు ఏడు వేల రూపాయల నుంచి ఎనిమిదివేల రూపాయల మధ్యలో కరెంట్ బిల్లు వచ్చేదని షాప్ యజమాని తెలిపారు. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే..












Click it and Unblock the Notifications