కాంగ్రెస్‌ ప్లీనరీ: కొన్ని సంగతులు

బాలీవుడ్‌ భామ తనూశ్రీ దత్తా డాక్టర్‌ సమరం అవతారమెత్తింది. ఉల్లాసంగా, బలంగా ఉండడానికి మంచి సెక్స్‌ ఎంతో ఉపకరిస్తుందని ఆమె బాలీవుడ్‌ పత్రికకు చెప్పడం సంచలనం కలిగిస్తోంది. ఎంత డేరింగ్‌, ఎక్స్‌పోజింగ్‌ హీరోయిన్లు అయినా సెక్స్‌ గురించి మాట్లాడడం అరుదే. మంచి సెక్స్‌ అంటే నిర్వచనమేమిటో ఆమె చెప్పలేదు. ఆ విషయాన్ని కూడా ఆమె బయటపెట్టి ఉంటే మగరాయుళ్ళు గుండెలు ఆగిపోయేవేమో. ఇటీవల వచ్చిన వీరభద్ర చిత్రంలో అందాలు ఆరబోసిన తనూశ్రీ దత్తాకు తనుఫ్రీ దత్తా అని పేరు పెట్టారు. తనుశ్రీ సినిమాకు ముప్పై లక్షలు డిమాండ్‌ చేస్తోందట.

మేయర్‌గారి కుక్క, సిఐ దర్యాప్తు

నిజామాబాద్‌ నగర మేయర్‌ డి సంజయ్‌కి చెందిన బ్రౌనీ అనే పెంపుడు కుక్క మరణించడం అధికార వర్గాలను కదిలించింది. సంజయ్‌ పనిమనుషులు రెండు పెంపుడు కుక్కలకు ప్యాకెట్‌ పాలు తాగించగా బ్రౌనీ చనిపోయింది. ఆ విషాదం తట్టుకోలేని మేయర్‌ గారు కుక్క మరణంపై దర్యాప్తు బాధ్యతను ఒక సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించారు. మరణించిన కుక్క అవశేషాలను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపగా విషప్రయోగం జరిగిన విషయం వాస్తవమేనని తేలింది. దీనితో విద్రోహులు ఎవరో తెలుసుకోవాలన్న ఆతృత మేయర్‌ గారిలో పెరిగింది. మేయరే టార్గెట్‌గా పాలప్యాకెట్‌లో విషం కలిపారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజామాబాద్‌ మేయర్‌ సంజయ్‌ సమాన్యుడు కాదు, ఆయన రాష్ట్ర మంత్రి డి.శ్రీనివాస్‌ ముద్దుల తనయుడు.

ప్రణబ్‌ నివేదిక ఇప్పట్లో ఎండమావేనా?

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై యుపిఎ సబ్‌ కమిటీ చైర్మన్‌ ప్రణబ్‌ ముఖర్జీ ఇప్పట్లో నివేదిక ఇచ్చే అవకాశాలు కన్పించడం లేదు. టిఆర్‌ఎస్‌ నేత నరేంద్ర మాత్రం రెండు మూడు రోజుల్లో ప్రణబ్‌ ముఖర్జీ నివేదిక వస్తుందని నమ్మబలుకుతున్నారు. తెలంగాణ రాష్ట్రం దాదాపు ఏర్పడినట్టేనని ఆయన మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కె.చంద్రశేఖరరావు మాత్రం ఈ విషయంలో ఎందుకో ఈ మధ్య మౌనం వహిస్తున్నారు. ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంపై ఉపసంఘం నివేదిక ఇప్పుడే రాదని ఆ సంఘం సభ్యుడు రఘువంశ్‌ ప్రసాద్‌ చేసిన ప్రకటన టిఆర్‌ఎస్‌ శ్రేణుల్లో వణుకు పుట్టిస్తోంది. ఇక తెలంగాణపై పిసిసి అధ్యక్షుడు కె. కేశవరావు చేస్తున్న ప్రకటనలు ఎవరికీ అర్ధం కావడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+