చెంపదెబ్బలు తినలేదంటున్న రవితేజ
రవితేజ చెంపల మీద బాలకృష్ణ వాయించినట్టు వచ్చిన వార్తలను రవితేజ ఖండించాల్సి వచ్చింది. మీరా జాస్మిన్ బాలకృష్ణ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైనట్టు తెలుసుకుని రవితేజ మీరాకు ఫోన్ చేసి బాలకృష్ణ మంచివాడు కాదని చాడీలు చెప్పినట్టు ఒక వార్త అలా అలా ఆనోటి నుంచి ఈ చెవికి అన్నట్టు వ్యాపించింది. రవితేజ భయపెట్టడంతో మీరా జాస్మిన్ బాలకృష్ణతో నటించడానికి జంకగా విషయం తెలుసుకున్న బాలకృష్ణ, దర్శక నిర్మాతలు ఆమెతో మాట్లాడారని, రవితేజ చాడీలు చెప్పిన విషయం తెలుసుకున్నారని కూడా వ్యాపించింది. రవితేజను పిలిపించిన బాలకృష్ణ అతని రెండు చెంపలు వాయించినట్టు ఆ వదంతి సారాంశం. ఈ వదంతిని రవితేజ స్వయంగా మీడియా ప్రతినిధుల ముందు ఖండించుకోవలసి వచ్చిందంటే ఈ వదంతి సినిమా రంగంలో ఎంతగా వ్యాపించిందో అర్ధం చేసుకోవచ్చు. అయినా ఖండించవలసింది ఎవరు? దెబ్బలు తిన్నవారా? దెబ్బలు కొట్టినవారా?
అక్టోబర్‌లో జ్యోతిక-సూర్య పెళ్ళి?
సముద్రతీరంలో పోగుట్టుకున్న నమిత












Click it and Unblock the Notifications
