వైఎస్, బాబులకు ఎన్నికల పూనకం
ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. వారి ఆతృత, హడావుడి చూస్తే ఎన్నికలు బాగా దగ్గరికి వస్తున్నాయన్న అభిప్రాయం కలుగక మానదు.
అమావాస్య అని కూడా చూడకుండా వైఎస్ నేడు అనంతపురం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ళకు ప్రారంభోత్సవం చేశారు. ఆవేశపూరితంగా ప్రసంగించారు. తన పాలనలో, ఇందిరమ్మ దివ్య ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని ఆయన సెలవిచ్చారు.
ఆయన ప్రసంగాలకు సమాన్య జనం నుంచి స్పందన బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు సభలకు కూడా జనం బాగానే వస్తున్నారు. అయితే ఆయన ప్రసంగాలకు ప్రతిస్పందన పెద్దగా లేదు. చంద్రబాబు నాయుడికి బహిరంగ సభల్లో జనం ఉద్వేగాలను రెచ్చగొట్టే కళ ఇంకా అబ్బలేదు.
ఆ విషయంలో ఎన్టీఆర్ ఎంతో ముందు ఉండేవారు. ఆయనలో సగమైనా ఆ కళను వైఎస్ సాధనతో సమకూర్చుకోగలిగారు. రానున్న ఎన్నికలు చంద్రబాబుకు నిజంగా అగ్ని పరీక్షే.












Click it and Unblock the Notifications