చిరంజీవి, రామోజీ కొత్త కాంబినేషన్?
ఈమధ్య "ఈనాడు" పత్రిక, ఆ గ్రూపు టీవీ చానల్స్ చిరంజీవికి సంబంధించిన వార్తలను ఒక ప్రత్యేకమైన వాత్సల్యంతో ప్రచురిస్తున్నాయి, ప్రసారం చేస్తున్నాయి. చిరంజీవి పెట్టబోయే రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వాలని రామోజీరావు నిర్ణయించుకున్నారన్న సమాచారం బయటకు వస్తున్న తరుణంలో శ్రీజ పెళ్ళి విషయం వెలుగు చూసింది.
శ్రీజ పెళ్ళికి సంబంధించి దుందుడుకుగా కాకుండా, ఒక పరిపక్వతతో ఈనాడు వార్తలను ప్రచురించింది. ఈటీవీ చానల్ ది కూడా అదే బాట. ఈ విషయాలను గమనించిని చిరంజీవి తనకంటే వయసులో, సంపదలో ఎంతో పెద్దవారైన రామోజీరావుకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పుకున్నట్టు తెలుస్తోంది.
ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాడన్న నమ్మకాలు సన్నగిల్లడంతో రామోజీరావు చిరంజీవి కొత్త పార్టీకి మద్దతు ఇచ్చి, రాజశేఖరరెడ్డి అంతు చూడాలని వ్యూహం వేసుకున్నట్టు తాజా సమాచారం . చంద్రబాబు నాయుడు అలిగి గీ పెట్టిన పక్షంలో తెలుగుదేశం, చిరంజీవి పార్టీల మధ్య 60-40 నిష్పత్తిలో సీట్ల పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
