ప్రిన్స్ కాదు యువసామ్రాట్!!
తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్టుంది ప్రిన్స్ మహేష్ బాబు వ్యవహారం. అతిథి సినిమా తరువాత మీడియాతో మట్లాడిన మహేష్ తనకు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించాలని ఉందని స్పష్టంగా చెప్పాడు. ఒక పెద్ద హీరో అలా చెప్పడం అరుదు. మహేష్ బాబు చేసిన వ్యాఖ్యకు వేరే దర్శకుడైతే ఎగిరి గంతేసే వాడే. కానీ కమ్ముల ఆ టైపు కాదు కదా. శేఖర్ కమ్ముల చేతిలో ఆల్ రెడీ స్క్రిప్ట్ ఉందట. అయితే ఆ స్క్రిప్ట్ మహేష్ సూట్ కాదట. కచ్చితంగా ఆ స్క్రిప్ట్ అక్కినేని నాగార్జునకు సరిపోతుందట. నాగార్జున కూడా కమ్ముల కోసం డేట్స్ కేటాయించాడట. ఇది కార్యరూపం దాలిస్తే ఒక చక్కని సినిమా చూసే అవకాశం ప్రేక్షకులకు లభిస్తుందన్నమాట.











Click it and Unblock the Notifications