నగ్మాకు ఆ అబ్బాయంటే చాలా ఇష్టమట!!!
నగ్మా చెల్లి జ్యోతిక అన్న సంగతి తెలిసిందే. జ్యోతిక పెళ్లి చేసుకుని తల్లి కూడా అయింది కదా. ఈ విషయంలో నగ్మా వెనుకపడినప్పటికీ చెల్లి కుమారుడిని ముద్దు చేయడంలో మాత్రం వెనకడుగు వేయడంలేదు. జ్యోతిక భర్త సూర్య ప్రస్తుతం విదేశాలలో ఉన్నాడు. సూర్య విదేశాలకు వెళ్లడంతో జ్యోతిక తన సొంతూరు ముంబైకి వెళ్లింది. తమ ఇంటికి వచ్చిన సోదరి కుమారుడితో నగ్మా బిజీగా ఉంది. ఖరీదైన బొమ్మలు కొనుక్కొచ్చిందట. ఆ బొమ్మలతో ఆ బాబును ఆడిస్తోందట. ఆ అబ్బాయి మీద నగ్మాకు అంత ఇష్టం ఎందుకు అంటే ఆ అబ్బాయికి దియా అని తనే పెట్టిందట. దియా పేరు పెట్టగానే సూర్య కుటుంబ సభ్యులు కూడా నగ్మా సూచించిన పేరునే ఓకే చేశారట. అందుకే ఆ అబ్బాయి అంటే అంత ఇష్టమట.












Click it and Unblock the Notifications
