సిఎం పదవిపై రోశయ్య నిరాసక్తి
రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో అత్యంత సీనియర్ నాయకుడు రోశయ్య ఉన్నారు. ఆయనకు 55 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. ఒకవేళ వైఎస్ రాజశేఖరరెడ్డీని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాల్సి వస్తే ప్రత్యామ్నాయంగా విన్పించే పేర్లలో రోశయ్య ఒకరు.
కానీ ముఖ్యమంత్రి పదవిని నిర్వహించేటంత శక్తి తనకు లేదని రోశయ్య చెబుతున్నారు. అన్ని వర్గాలను మెప్పించడం సామాన్యమైన విషయం కాదని ఆయన అభిప్రాయం. రోశయ్యకు ఆయన కులమే మైనస్. వైశ్యులు ఈ రాష్ట్ర జనాభాలో రెండు శాతం కూడా ఉండరు.
రోశయ్యకు తన పరిమితులు ఏమిటో బాగా తెలుసు. అందువల్లనే ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద సీనియర్ మంత్రిగా పనిచేసినా ఆయనకు ఆ పెద్ద పదవి మీద మనసు పోలేదు. తన వాగ్ధాటితో కాంగ్రెస్ కు ఆయన ఎప్పుడూ రక్షణ కవచంలా ఉంటారు.
అసెంబ్లీలో రోశయ్య మాట్లాడడానికి లేచారంటే ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు నాయుడికి "చిటికెన వేలు" గుర్తుకు వచ్చి వణికిపోతారు. రోశయ్య వంటి నాయకుడిని కాంగ్రెస్ అధిష్టానవర్గం జాతీయ సేవలో ఉపయోగించుకుంటే బాగుంటుంది.












Click it and Unblock the Notifications