శ్రీలంకలో శ్రీరాముడి సంగతులు
శ్రీరాముడి గురించి అవాకులు చెవాకులు పేలిన వృద్ధ నాయకుడు, తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి తన తప్పును ఆలస్యంగా తెలుసుకున్నారు. లోక్ సభకు మధ్యంతర ఎన్నికలు వస్తున్న సూచనలు కన్పించడంతో ఆయన వ్యాఖ్యలు తాజా రాజకీయ దుమారంలో కొట్టుకు పోయాయి.
ద్రావిడ రాజకీయ సిద్ధాంతాలతో పండిపోయిన కరుణానిధి నాస్తికుడు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో తమిళనాడులో నాస్తికులు ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు పరిష్దితి వేరు. కొత్త తరానికి దేవుళ్ళ మీద, మన పురాణాల మీద విపరీతమైన నమ్మకం ఉంది. అందుకు కరుణానిధి మనవలు, మనవరాళ్ళు మినహాయింపు కాదు.
రామాయణ కాలం నాటి విశేషాలు శ్రీలంకలో ఇప్పటికీ సజీవంగా ఉన్నాయని శ్రీలంక పర్యాటన శాఖ మంత్రి మోహన్ సాలియా నిన్న హైదరాబాద్ లో చెప్పడం విశేషం. తమ దేశంలో రాముడు, హనుమంతుడికి సంబంధించిన ప్రదేశాలు, విశేషాలు పదిలంగా ఉన్నాయని, భారతీయ పర్యాటకులు పెద్ద సంఖ్యలో రావాలని ఆయన కోరారు. కరుణానిధి గారూ, కాస్త ఆలోచించండి.












Click it and Unblock the Notifications