బాలయ్యకి ఏ కథ నప్పుతుంది?

Balakrishna
అవును...బాలకృష్ణకు ఏ కథ సరిపోతుంది ? ఇప్పుడు బాలయ్య అభిమానులకే కాక,ఆయనకు కథ వినిపించాలనుకునే దర్శక,రచయితలకు ఇదే ప్రశ్న తొలుస్తోందన్నది నిజం. ఎందుకంటే వెరైటీ అనేది దాదాపు ప్రతి సినిమాలో ప్రయత్నిస్తూ ఆయన కెరీర్ ప్రారంభం నుండీ చేస్తూ వస్తున్నారు.సైన్స్ ఫిక్షన్ నుండి పౌరాణికాలు,కామిడీలు,జానపదం,రొమాంటిక్ కామిడి,యాక్షన్ ఫ్యామిలీ డ్రామాలు అంటూ రకరకాల కథలు చేసేసారు. అయితే వాటిల్లో ఎక్కువగా అభిమానులను అలరించిన అంశం అచ్చ తెలుగుకు పట్టం కట్టడం.

అందులోనూ ఆయన మొదటి నుంచి అందరూ ఐడింటిఫై చేసుకునే గ్రామీణ యువకుడు పాత్రలో జీవించారు. అందుకే ఇప్పటికీ మంగమ్మగారి మనవడు చిత్రం ఆంధ్రాలో ఏదో మూల జనం చూస్తూనే ఉంటారు. అయితే తర్వాత వచ్చిన మార్పులతో ఆయన రకరకాల ప్రయోగాలు చేసారు. సక్సెస్ ,ఫెయిల్యూర్స్ కి అతీతంగా వాటిల్లో లీనమయ్యి చేయటం అందరకీ బాగా నచ్చింది.

అయితే ట్రెండు సెక్టర్ గా మారి రికార్డులు సృష్టించిన సమరసింహా రెడ్డి ,నరసింహనాయుడు చిత్రాలు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వచ్చి తర్వాత ఏంటి అనేది డైలమాలో పడేసాయి.వీటీ ఆయన ఏ సినిమా చేసినా ప్రేక్షకులు వాటితో పోల్చుకోవటం జరుగుతోంది. అందులోనూ దాదాపు అందరు హీరోలు ఈ కొత్త ట్రెండుని పట్టుకుని తమ ఖాతాలో హిట్లు జతేసుకున్నారు. దాంతో అంతకు మించిన యాక్షన్ ఎపిసోడ్లు ఉంటేనే ఎన్నో అంచనాలతో ధియోటర్లో కి వచ్చిన ఆయన అభిమానులు సంతృప్తి చెందుతున్నారనేది నిజం. ఈ పరిస్ధితిల్లో పాండురంగడు అంటూ పౌరాణిక చిత్రం చేసారు. దాని ఫలితం తెలిసిందే. రెండు పాత్రల్లో ఆయన పరిణితి చెందిన నటన చూపారని అంతా మెచ్చుకున్నారు కానీ శృంగారం ఎక్కువైందని విమర్శలు ఎదుర్కొంది.

మరో ప్రక్క ప్రస్తుతం పరిణామాలతో పొలిటికల్ సినిమా చేస్తారా అనే సందేహం వస్తోంది. ఇలాంటి స్ధితి అప్పట్లో అమితాబ్ కీ వచ్చింది. ఆయన ఒక స్టేజీలో యాక్షన్ సినిమాలుతో హై పిచ్ కి వెళ్ళిపోయారు. ఎవరు ఏ కొత్త ప్రాజెక్టు శ్రీకారం చుట్టినా ఆ పాత కథల్లోంచే వచ్చేవి. దాంతో విసిగిన ఆయన హీరోయిజం అనే దానికన్నా అధ్బుతమైన పాత్ర చిత్రణకే ప్రాధాన్యతనిచ్చి మళ్ళీ తానేమిటో ప్రూవ్ చేసుకున్నారు. ఆయన ఏ సినిమాలో ఏ పాత్ర చేసినా అదే హైలెట్ అయ్యే స్ధితికి వచ్చి యువతరానికి పోటీ ఇచ్చే స్ధితికి వచ్చారు. ఇవాళ ఆయన దాదాపు రెండేళ్ళ దాకా డేట్స్ ఖాళీ లేని హీరో.

అయితే బాలయ్య హీరోయిజం వదలాల్సిన పనిలేదు. కాకపోతే కథల్లో నాణ్యత ఉండి,తనని ప్రేక్షకులు ఆదిరిస్తూ వచ్చిన గ్రామీణ పాత్రలో కనిపిస్తే బాగుంటుందనేది కొందరి వాదన. రొటీన్ ప్రేమ,ఫ్యాక్షన్ కథలకు కొంత కాలం గ్యాప్ ఇచ్చి సంతోషం వంటి ఫ్యామిలీ రొమాంటిక్ సినిమాలో చేస్తే అధ్బుతంగా నప్పుతుందనేది మరికొందరి ఆలోచన.అదేం కాదు గ్లాడియేటర్ వంటి చారిత్రక చిత్రం చేస్తే కొంచెం కష్టమైనా బాగుంటుందనేది కొందరి నిర్ణయం.

ఈ చర్చలకు అతీతంగా ఇప్పుడు ఆయన తన అన్న కుమారుడు కళ్యాణరామ్ నిర్మాణంలో సినిమా చేయబోతున్నారు. ఈ సమయంలో ఆయన ఎన్నుకునే కథ కాస్త ప్రక్కకు వచ్చి బాలయ్య లోని నటుడు ని పూర్తి స్ధాయిలో ఆవిష్కరిస్తూండాలని అభిమానులుకోరుకుంటున్నారు. ఇంత కాలం తను అభిమానుల గుండెల్లో నిలిచిపోయేలా చేసిన భూమి మీద నిలబడే హీరో పాత్ర చేస్తే మళ్ళీ అదే రేంజి కలెక్షన్స్ కురుస్తాయి అనేది నిజం అని అంతా నమ్ముతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+