తన దైన శైలిలో వరసగా మాఫియా సినిమాలు తీస్తూ,కాంట్రావర్సీ స్టేట్ మెంట్స్ ఇస్తూ ముందుకు వెళ్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన మరొక్కసారి వార్తల్లోకి ఎక్కారు. ఆయన తాజాగా తీసిన ఫ్లాఫ్ కాంట్రాక్ట్ ఈ సారి దానికి వేదిక అయ్యింది. ఈ సినిమా మాఫియాకి టెర్రరిస్టులకు ఉన్న సంబంధ బాంధవ్యాలు చూపుతుంది. ఈ అండర్ కవర్ పోలీస్ స్టోరీ లో కొన్ని బాంబు పేలుళ్ల సన్నివేశాలు ఉన్నాయి. వాటి నుండే ప్రేరణ చెందే తీవ్రవాదులు అహ్మదాబాద్ బాంబు పేలుళ్ళు ప్లాన్ చేసారని ముంబాయి అంతటా ప్రచారం సాగుతోంది. అంతదగ్గరగా ఆ సన్నివేశాలు సింక్ అవుతున్నాయని చూసిన వాళ్ళు వంత పాడుతున్నారు.దాంతో సినిమా కలెక్షన్లు పెరగటం మాట దేముడెరుగు గానీ వర్మని అందరూ ఆడి పోసుకుంటున్నారు. భారీ విధ్వంసానికి దారి చూపే ఇటువంటి చిత్రాలను అసలు రిలీజ్ కానివ్వకూడదని కోరుకుంటున్నారు. భవిష్యత్ లో ముంబయి సెన్సార్ బోర్డు మరింత పదునెక్కాలని వారు డిమాండ్ చేస్తున్నారు.