చంద్రబాబుకు మరో షాక్

చంద్రబాబు వద్ద ఇప్పుడు ప్రైవేటు కార్యదర్శిగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఆయన అకస్మాత్తుగా ముఖ్యమంత్రిని కలుసుకుని తనను ఆ పోస్టు నుంచి బదిలీ చేయమని కోరడం, అందుకు సిఎం అంగీకరించడం వెనుక హై డ్రామా నడిచినట్టు కనిపిస్తోంది. జర్నలిస్ట్ యూనియన్ నాయకుడు కె. శ్రీనివాసరెడ్డి విజయకుమార్ ను వెంటబెట్టుకుని వైఎస్ క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్ళినట్టు తెలుస్తోంది.
చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అనేక డీల్స్, ఆ రహస్యాలు విజయకుమార్ కు తెలుసు. జాయింట్ డైరెక్టర్ హోదా కలిగిన విజయకుమార్ కు మంచి పోస్టింగ్ ఇప్పించి ఆ రహస్యాలను బయటపెట్టించాలని వైఎస్ శిబిరం పథకం వేసి ఉంటుందని కొందరు తెలుగుదేశం నాయకులే అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications