చంద్రబాబు భయాలు

తమ్మినేని సీతారాం, అయ్యన్నపాత్రుడు వంటి ప్రముఖ తెలుగుదేశం నాయకులు కూడా చిరు పార్టీలోకి దూకడానికి సిద్ధం కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశమైంది. చంద్రబాబు నాయుడు క్రమంగా తెలుగుదేశం పార్టీ బలపరచడంలో విఫలమవుతున్నారా? తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడే సుప్రీం కాబట్టి ఆయనకు వెన్నుపోటు పొడిచే సాహసం టిడిపి నాయకులు చేయలేరు. అంత సత్తా ఉన్న ఏకైక నాయకుడు దేవేందర్ గౌడ్ సొంత పార్టీ పెట్టుకోవడాన్ని బట్టి ఇతర టిడీపి నాయకులు నిద్రలో కూడా చంద్రబాబు అంటే భయపడుతున్నారు. చంద్రబాబు బానిసల్లాగే టిడీపిలో కొనసాగాలని కొందరు అనుకుంటూ ఉండగా, తమ్మినేని, అయ్యన్న పాత్రుడు వంటి అభిమాన ధనులు చిరంజీవి పార్టీలోకి జంప్ కావాలని ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications