చంద్రబాబు 'చిరు' నవ్వులు

Chandrababu Naidu
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది చాలా విచిత్రమైన మొహం. అధికారంలో ఉన్న తొమ్మిదేళ్ళ కాలంలో ఆయన మొహంలో చిన్న చిరునవ్వు కూడా కన్పించేది కాదు. అప్పట్లో ఆయన విపరీతమైన అవినీతి పరుడని ప్రచారం ఉండేది. కానీ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి అవినీతి మీద అంతకు పదిరెట్లు ఆరోపణలు వచ్చాయి. రాయలసీమ ముఠాలు హైదరాబాద్ లో డెన్ లు ఏర్పాటు చేసుకుని రియల్ ఎస్టేట్ దందాలు చేసుకోవడం ప్రారంభించడంతో చంద్రబాబు నాయుడికి చెందిన సామాజిక వర్గానికి గట్టి దెబ్బ తగిలింది.

గుంటూరు యువగర్జనను సూపర్ హిట్ చేసుకోవడం ద్వారా ఇటు చిరంజీవికి, అటు వైఎస్ కు భయం కలిగించామన్న అభిప్రాయం చంద్రబాబు నాయుడిలో ఉంది. గురువారం ఉదయం హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తున్నంత సేపు చంద్రబాబు నాయుడు మొహంలో చిరునవ్వులు చిందాయి.

గతంలో స్నేహం చేసిన చిరు, బాబులు ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. చిరంజీవితో సినిమాలు తీసి కోట్లు సంపాదించుకున్న చలసాని అశ్వనీదత్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చంకలో చేరారు. ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులే పలుకుతుందనడానికి ఇంత కంటే చక్కటి ఉదాహరణ ఏం కావాలి?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+