పాపం! వీక్ సత్తా, దీనేందర్ గౌడ్!

సమయం చిక్కినప్పుడల్లా జెపి, గౌడ్ లు సామాజిక న్యాయం గురించి, ఇతర "గొప్ప" విషయాల గురించి చర్చించుకునే వారన్న విషయం అప్పటి మీడియా ప్రతినిధులకు బాగా తెలుసు. ఇప్పుడు వీరిద్దరూ ఎవరి దుకాణం వారు తెరుచుకున్నారు. చిరంజీవి బహిరంగ సభ సక్సెస్ కావడంతో వీరిద్దరూ ఫోన్ లో పరిస్ధితిని విశ్లేషించుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక్క విషయం మాత్రం నిజం. కాంగ్రెస్ కు, తెలుగుదేశం పార్టీకి కేడర్ బలం ఉంది. చిరంజీవి పార్టీకి ఫ్యాన్స్ బలం ఉంది కానీ అది కేడర్ గా మారడానికి కొంత సమయం పడుతుంది. లోక్ సత్తా సత్తా ఏమిటో గత ఉప ఎన్నికల్లోనే బయటపడింది. ఇప్పుడు చిరు వచ్చు యూత్ ను ఆకర్షించడంతో లోక్ సత్తా వీక్ సత్తాగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే దేవేందర్ గౌడ్ పార్టీకి కూడా అవకాశాలు అంత ఆశావహంగా లేదు.












Click it and Unblock the Notifications
