జూనియర్ ఎన్టీఆర్ బాధలు ఎన్నో....

ఇంతకాలం నిన్ను ఆ కుటుంబానికి దూరం పెట్టినవారు ఇప్పుడు అవసరం కోసం కలుపుకుంటున్నారే తప్ప మరొకటి కాదని జూనియర్ ఎన్టీఆర్ తల్లి అతనికి అర్ధమయ్యేలా చెప్పినట్టు తెలుస్తోంది. అసలే డైటింగ్ తో చిక్కిపోయిన జూనియర్ ను ఈ పరిస్ధితి మరింత సందిగ్ధంలోకి నెట్టివేసి మరింత నీరసానికి గురిచేసినట్టు కనిపిస్తోంది. జూ.ఎన్టీఆర్ హరికృష్ణ రెండో భార్య కుమారుడు. రెండో భార్య కర్ణాటక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ ను చిన్ననాటి నుంచి నందమూరి కుటుంబీకులు ఆప్యాయంగా ఏనాడూ దగ్గరికి తీయలేదని తెలుస్తోంది. చిన్నప్పటి నుంచి ఆ మనో వేదనను అనుభవించిన జూనియర్ స్వయంకృషితో ఈనాడు పెద్ద హీరోగా ఎదిగాడు. చంద్రబాబు అండ్ కంపెనీ ఇప్పుడు అతనికి పెడుతున్న ఆకర్షణలు ఎవరికి లాభం చేకూరుస్తాయో ఎవరికి నష్టం కలిగిస్తాయో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications