పనబాక లక్ష్మి నోటి దురుసు

పనబాక లక్ష్మి భర్త పనబాక కృష్ణయ్య దక్షిణ మధ్య రైల్వేలోనే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసరుగా పనిచేస్తున్నారు. ఆయన కంటే జనరల్ మేనేజర్ పదవి ఎన్నో మెట్లు ఉన్నతమైనది. కృష్ణయ్య పనితీరు నచ్చక జనరల్ మేనేజర్ తరచు విసుక్కుంటున్నారని, దానితో తన బాధను రాజకీయ నాయకురాలు కేంద్ర మంత్రి అయిన భార్యకు కృష్ణయ్య చెప్పుకున్నారని ఒక వర్గం కథనం. కేంద్రంలో పలుకుబడి గల లక్ష్మి జనరల్ మేనేజర్ ను బదిలీ చేయించడానికి ప్రయత్నించారని, కానీ రైల్వే శాఖ మంత్రి లాలూ యాదవ్ ఆమె ప్రయత్నాలను అడ్డుకున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications
