'కంత్రి' తో టిడిపి ప్రచారం!?

ఇవి నిజమైతే 'కంత్రి' ద్వారా తన వంతు సాయం తమ పార్టీకి చేస్తున్నాడన్నమాట. అయితే దీన్ని ఎన్టీఆర్ ఖండిస్తున్నాడు. "ప్రత్యేకంగా ఓ పార్టీ గురించో, మరొకరి గురించో ప్రస్తావించే రాజకీయ సంభాషణలు కంత్రీ లో లేవు. కథానుగుణంగా సామాజిక శ్రేయస్సు దృష్ట్యా కొన్ని మాటలున్నా వాటికి రాజకీయాలతో ముడిపెట్టలేం" అని అతను చెపుతున్నాడు. అతను ఖండించినా డైలాగులు అయితే ఉన్నాయని ఆ విషయాన్ని ముందే చెబితే ఇప్పట్నించే విమర్శలు మొదలవుతాయనే ఉద్దేశంతోటే ఎన్టీఆర్ అలా చెబుతున్నాడని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. వాస్తవం తేలాలంటే తొమ్మిదవ తేదీదాకా ఆగాలి.












Click it and Unblock the Notifications
