ఈ టీవీ లోకి ప్రభాకర్ రీ ఎంట్రీ!

ఇంతకుముందు ఛానల్‌లోని అధిక కార్యక్రమాల్లో క్రియేటివ్ హెడ్ పేరున ప్రభాకర్ జోక్యం చేసుకుంటూ వుండటం రామోజీరావుకు సుతరామూ గిట్టేది కాదు. అప్పటికే ప్రభాకర్ వ్యవహార సరళిపై రామోజీకి లెక్కకుమించి ఫిర్యాదులందటం,సీరియళ్ల నిర్మాణంలోనూ, వాటి షెడ్యూళ్ల నిర్వహణలోనూ ప్రభాకర్ మితిమీరిన జోక్యంపై ఆయన కన్నెర్ర జేశారు. దాంతో ప్రభాకర్‌ను తనవద్దకు పిలిపించుకున్న రామోజీ అతణ్ణి తీవ్రంగా మందలించారు. దాంతో ఖంగుతిన్న ప్రభాకర్ వెంటనే తన క్రియేటివ్ హెడ్ పోస్టుకు రాజీనామా చేసేశాడు. ఇది సుమన్‌కు ఆగ్రహం తెప్పించింది. తనకు అత్యంత ఆప్తుడు, సన్నిహితుడు అయిన ప్రభాకర్‌ను తండ్రి అవమానించడంతో అతడికి చిర్రెత్తుకొచ్చింది. దాంతో ఈటీవీ మేనేజింగ్ డైరెక్టర్ పదవికీ రాజీనామా చేశాడు.
దాంతో ఈ తండ్రీకొడుకుల మధ్య సయోధ్య కోసం రామోజీ పెద్ద కుమారుడు, ఈనాడు దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ అయిన కిరణ్, అతని భార్య శైలజ కృషి చేసారు. అది ఫలించి మొత్తానికి ఈ కుటుంబ కలహం ప్రశాంతంగా సద్దుమణిగిపోయింది. సుమన్ ఎప్పటిలా ఈటీవీలోకి ప్రవేశించారు. దాంతో కొన్నేళ్లుగా సుమన్ అండతో ఈటీవీలో చక్రం తిప్పిన ప్రభాకర్ కూడా వచ్చేసారు. ఇంతకాలం ప్రభాకర్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వస్తున్నారు. ఆయనకి తమ సినిమాలో పాత్ర ఇస్తే ఆ సినిమాలని ప్రభాకర్ ఈ టీవి కి మంచి రేటుకి శాటిలైట్ రైట్స్ అమ్మిస్తారని ఆశ. అయితే ఫ్రభాకర్ ఛానల్ నుండి బయిటకు రాగానే వారంతా డైలమాలో పడ్డారు. అయితే ఇప్పుడంతా హ్యాపీ . ఈటీవీ కి మళ్ళీ గత వైభవం పట్టినట్లే...సుమనోహరాలకు, ప్రభాకర్ టీవీ సీరియల్స్ కి...గేమ్ షోలకు లోటుండదని వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications
