భార్గవితో పాటు ప్రవీణ్ ది కూడా హత్యేనా?

భార్గవిని హత్య చేసిన వారే ప్రవీణ్ ను కూడా సైనైడ్ తో హతమార్చి ఉండవచ్చని ప్రవీణ్ సోదరుడు పోలీసులకు చెప్పారు. ప్రవీణ్ మొదటి భార్య డాలీని, రెండో భార్య స్వప్నను కూడా వారి ఇళ్ళకు వెళ్ళి పోలీసులు విచారించారు. ప్రవీణ్ కుటుంబసభ్యులను, అతని స్నేహితులను కూడా పోలీసులు విచారించారు. ఈ కేసు విషయంలో అప్పుడే ఒక నిర్ణయానికి రాలేమని పోలీసులు చెబుతున్నారు. ప్రవీణ్ కు ఎవరైనా శత్రువులు ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్ తో కలిసి ప్రదర్శనలు ఇచ్చిన సమయంలో భార్గవి తరచుగా నెల్లూరు వచ్చేదని, ఆమెకు ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉండే వాడని పోలీసుల దృష్టికి వచ్చింది. నెల్లూరులో ఆమెకున్న పరిచయాలపై ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications