ఈ కథనం దేనికి 'సాక్షి'?

YS Jagan
ఈరోజు "సాక్షి" దిన పత్రిక తన అసలు రంగును బయటపెట్టుకుంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలోకి తెలుగుదేశం నుంచే ఎక్కువ మంది చేరుతున్నారన్న వాస్తవాన్ని బ్యానర్ స్టోరీలో "సాక్షి" బయటపెట్టింది. చిరంజీవి రాష్ట్ర యాత్ర ప్రారంభమైతే తెలుగుదేశం నుంచి వలసలు మరింత పెరుగుతాయని ఈ పత్రిక అంచనా. పొత్తుల కారణంగా తెలంగాణలో టికెట్లు రావన్న గుబులు తెలుగుదేశం తెలంగాణ నాయకులకు పట్టుకుందన్న విషయాన్ని ఈ పత్రిక సరిగ్గానే రాసింది.

అయితే ప్రజారాజ్యం వల్ల తెలుగుదేశం పార్టీకే పెద్ద నష్టమని ఈ అధికార తెలుగు దిన పత్రిక ప్రచురించడం సమంజసంగా లేదు. చిరంజీవి పార్టీ వల్ల కాంగ్రెస్ కు కూడా భారీగా నష్టం జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న కాపులు ఇప్పుడు చిరు పార్టీలోకి భారీగా తరలిపోయే అవకాశాలున్నాయి. నాయకుల మాట ఎలా ఉన్నా ఈ మధ్యతరగతి కాపులు నిశ్శబ్దంగా చిరంజీవి పార్టీకి ఓటేయవచ్చన్న సమాచారం కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద కూడా ఉంది. వచ్చే ఎన్నికల్లో చిరంజీవిని, చంద్రబాబు నాయుడిని, టీఅర్ ఎస్ చంద్రశేఖరరావుని కలపడానికి ఒక పత్రికాధిపతి ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే అధికార కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి పెద్ద దెబ్బే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+