చిరు సరసన సుహాసినిbrఇతర పార్టీలను అనుకరిస్తూ సినీ నటి సుహాసినిని చిరు పార్టీ మహిళా అధ్యక్షురాలిగా
Grapevine
-Staff
By Staff
చిరంజీవి,సుహాసిని కాంబినేషన్లో గతంలో ఎన్నో సినిమాలు వచ్చి విజయవంతం అయ్యాయి .అలాగే ఆమె ,చిరంజీవి మంచి స్నేహితులు అన్న విషయం పరిశ్రమలో అందరికీ తెలిసిందే.దాంతో చిరంజీవి త్వరలో పెట్టబోయే పార్టీకి ఆమె మహిళా అధ్యక్ష్యురాలిని చేసే అవకాశం ఉందని వార్తలు వినపడుతున్నాయి. అందులోనూ తెలుగు దేశం పార్టీ మహిళా అధ్యక్ష్యురాలిగా మాజీ సినీ నటి రోజా కొనసాగుతున్నారు.అలాగే త్వరలో మాజీ సినీ నటి జీవితా రాజశేఖర్ ని కాంగ్రేస్ మహిళా అధ్యక్ష్యురాలిగా నియమిస్తారని ఊహాగానాలు వినపడుతున్నాయి.ఆ ఇద్దరి సినీ గ్లామర్ కి పోటీగా సుహాసిని ని తమ పార్టీ మహిళా అధ్యక్ష్యురాలి గా చేస్తే బాగుంటుందని చిరంజీవి క్యాంపు ఆలోచిస్తున్నట్లు వార్తలు వినవస్తున్నాయి.అయితే సుహాసిని ఇంకా యే నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ చూసుకుంటూనే అడపాదడపా సినిమాలు,టీవీ పోగ్రామ్స్ చేస్తున్నారు.