'సూర్య' సూర్యప్రకాశరావు కథా కమామిషు

"సూర్య" దినపత్రిక యావరేజ్ విజయం సాధించినప్పటికీ, ఆయన నెలవారీ లక్షలాది రూపాయలు ఈ పత్రిక ద్వారా నష్టపోతున్నా ఆయన ముందు చూపు ఆయనకు ఉందని చెబుతున్నారు. మాటలు అత్తిలి సత్తిబాబులా గ్రామీణ యాసలో ఉన్నప్పటికీ నూకారపుకు ఉన్న బిజినెస్ సెన్స్ అపారమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
కాంగ్రెస్ రాజకీయాల్లో డబ్బు నష్టపోయినా, భూముల ద్వారా బాగా లాభ పడుతున్న నూకారపు సూర్యప్రకాశరావుకు గ్రహస్ధితి భూములకు అనుకూలంగా ఉందని జ్యోతిష పండీతులు చెబుతున్నారు. ఏనాడో ఆయన అడ్వాన్సులు ఇచ్చిన నాదర్ గుల్ లోని కొన్ని ఎకరాల భూముల ద్వారా ఆయనకు దాదాపు 800 కోట్ల రూపాయలు వచ్చినట్టు సమాచారం. నూకారపు సినిమా నిర్మాత కూడా. సినిమా రంగంలో మిశ్రమ ఫలితాలను చవి చూసిన ఆయన ఇ ప్పుడు తమిళ, కన్నడ సినిమాల మీద దృష్టి పెడుతున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications
