చిరు చింపేదేమిటి? కాపుల మధనం!

కృష్ణా జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో కాపుల ఆధిపత్యం బాగా ఉంది. ఐదుగురు కాపు ఎమ్మెల్యేలు ఈజిల్లా నుంచి కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాదాపు రెండు మూడు కోట్ల జనాభా ఉన్నప్పటికీ కాపు వర్గానికి చెందిన వ్యక్తి ఇంతవరకు ముఖ్యమంత్రి కాకపోవడం ఆ వర్గంలో ఆవేదన కలిగిస్తోంది. అయితే చిరంజీవి ముఖ్యమంత్రి అయినా ఆ పదవిని నిలుపుగోగలరా అనే సందేహం వారిని పీడిస్తోంది. రాజశేఖరరెడ్డి హయాంలో తమ వర్గానికి మంచి ప్రాధాన్యత ఉన్న నేపధ్యంలో చిరు వచ్చి కొత్తగా అదనంగా చేసేదేమిటని వీరు మధనపడుతున్నారు.












Click it and Unblock the Notifications
