ఇంకా మారని చంద్రబాబు

ఇటీవలి గుజరాత్ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీకి మీడియా తీవ్ర వ్యతిరేకిగా మారింది. మీడియా రాతలు జనాన్ని ప్రభావితం చేసి ఉంటే గుజరాత్ లో ఆయన మళ్ళీ పెద్ద మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండేవారు కాదు. ఇంత అనుభవం ఉన్నా చంద్రబాబు మీడియా తోక పట్టుకుని ఎందుకు గోదావరిని ఈదాలనుకుంటున్నారో అర్ధం కాదు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తీసుకోడానికి వచ్చిన ఎన్ టీవీ ప్రతినిధులను చంద్రబాబు కడిగేసినట్టు సమాచారం. ఎన్ టీవీలో షబ్బీర్ అలీ వంటి కాంగ్రెస్ నాయకుల పెట్టుబడులు ఉండడంతో ఆ చానల్ కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు అసహనం కావచ్చు. అయినా చిన్న విషయాలకు ఎందుకింత రాద్ధాంతం. ఎన్టీఆర్ లాగే నేరుగా ప్రజలకే సందేశం ఇవ్వవచ్చు కదా?












Click it and Unblock the Notifications