చంద్రబాబు పిరికితనం!

పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతో గురువారం రెండున్నర గంటల పాటు పార్టీ అధినేత భేటి అయ్యారు. బహిరంగంగా తన వాదనను వినిపించడంపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తలసానిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సమక్షంలో సుదీర్గంగా జరిగిన చర్చలతో తలసాని వివాదం సద్దుమణిగింది.
ప్రత్యేక రాష్ట్ర వాదన సున్నితమైన విషయం. సీనియర్ నాయకుడిగా ఉండి బహిరంగంగా మాట్లాడటం తప్పని చంద్రబాబునాయుడు అన్నట్లు తెలిసింది. ప్రస్తుతం తెలంగాణ వాదంపై మాట్లాడొద్దు. ప్రజా సమస్యలపై ఇప్పుడు పోరాడుదాం..అని చంద్రబాబు తలసానితో చెప్పినట్లు సమాచారం. తాను కాంగ్రెస్ పార్టీలో చేరతానంటూ వచ్చిన మీడియా కథనాలకు తాను బాధ్యున్ని కాదని తలసాని వివరణ ఇచ్చినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications