రోశయ్యకే 'చిరు' మద్దతు?

Chiranjeevi
ముఖ్యమంత్రిగా కె.రోశయ్యకే ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి మద్దతు లభించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. చిరంజీవి పూర్తిగా మద్దతు ప్రకటించకపోయినా ఆయనకు తగిన చేయూత అందించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రోశయ్యను చిరంజీవి తిరుపతిలో కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాకుండా రోశయ్యతో కలిసి ఆయన హైదరాబాద్ కు వచ్చారు. చిరంజీవి ఆ మధ్య కాలంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. రోశయ్య సమర్థవంతమైన నాయకుడని ఆయన అభిప్రాయపడ్డారు. రోశయ్యకు మంత్రులు సహకరించడం లేదని విమర్శించారు. దీన్ని బట్టి పెద్దాయనకు మద్దతు ఇవ్వడం అవసరమని చిరంజీవి భావిస్తున్నట్లు చెబుతున్నారు. వైయస్ మరణానంతరం జగన్ వర్గీయులు వ్యవహరించిన తీరు కూడా చిరంజీవికి రుచించలేదని అంటున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ కు మద్దతివ్వాలని చిరంజీవిని కలిసి కొంత మంది మంత్రులు కోరారు. వైయస్ భౌతిక కాయానికి అంత్యక్రియలు కూడా జరగక ముందే నాయకత్వం కోసం అర్రులు సాచడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవిపై మాట్లాడే సమయం ఇది కాదని వారికి ఆ సమయంలో చెప్పారు. ఈ స్థితిలో రోశయ్యకు మద్దతివ్వడమే మంచిదని ఆయన అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు. ఈ మద్దతు ఏ రూపంలో ఉంటుందనేది తెలియదు. నైతికంగా ఇప్పటికే మద్దతిస్తున్న చిరంజీవి అవసరమైతే పూర్తిగా ఆయన నాయకత్వాన్ని బలపరుస్తారా అనేది వేచి చూడాల్సిందేనని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+