వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి-టీఅర్ ఎస్ పొత్తుకు గద్దర్ అడ్డం?

By Staff
|
Google Oneindia TeluguNews

Gaddar
తెలంగాణకు అనుకూలంగా పవన్ కల్యాణ్, చిరంజీవి మాట్లాడుతున్న నేపధ్యంలో మావోయిస్టులు, జనశక్తి నక్సలైట్లు, తెలంగాణ మేధావులు ప్రజారాజ్యంపై ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రజారాజ్యం పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని అభిప్రాయం తెలంగాణ మేధావుల మినీ సమావేశాల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రాన్ని అడ్డంగా దోపిడీ చేసి పేద, గ్రామీణ ప్రజలతో జీవితాలతో ఆటలాడుకున్న చంద్రబాబు, వైఎస్ లకు చెక్ పెట్టాలంటే ఫ్రెష్ గా కొన్ని ఆశయాలతో ముందుకు వచ్చిన ప్రజారాజ్యంకు మద్దతు ఇవ్వాలని, టీఅర్ ఎస్- ప్రజా రాజ్యం కలిస్తే తెలంగాణలో ప్రభంజనం వస్తుందని వీరు భావిస్తున్నారు.

మహాకూటమి నీరు గారిపోవడానికి, టీఆర్‌ఎస్‌ అందులో చేరకపోవడానికీ ప్రజాగాయకుడు గద్దర్‌ ప్రభావమే కారణమా? దీనికితోడు తెలంగాణ మేధావుల ఒత్తిళ్లు కూడా టీఆర్‌ఎస్‌పై ప్రభావం చూపించాయా? తాజా పరిణామాలు, మేధావుల హెచ్చరికలు పరిశీలిస్తే ఈ అనుమానాలు నిజమనిపించకమానదు. పవన్ కల్యాణ్ తో గద్దర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందువల్ల తెలంగాణ కళాకారులు టీఅర్ ఎస్- ప్రజారాజ్యం మధ్య పొత్తును కోరుకుంటున్నారు.

ఇది మహాకూటమి కాంగ్రెస్‌కు ఓటమి','మేమంతా రానున్న ఎన్నికల్లో కలసి పోరాడేందుకు నిర్ణయించుకున్నాం. ఈనెల 21న మేము ఈ విషయాన్ని లాంఛనంగా ప్రకటిస్తా'మంటూ చెప్పిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హటాత్తుగా వెనక్కి తగ్గడం, సిద్ధాంతాలు కాకుండా సీట్ల విషయంలోనే పొత్తుల ప్రతిష్టంభన ఏర్పడటానికి కారణాలేమిటన్న అంశం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతా అయిపోతుందనుకున్న తరుణంలో కేసీఆర్‌ అడ్డం తిరగడానికితిరగడానికి తెలంగాణ మేధావి వర్గాల నుంచి వచ్చిన ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X