మళ్ళీ రెడ్డి, కమ్మ యుద్ధం?

బాపట్ల నియోజకవర్గం రిజర్వు కావడంతో పురంధరేశ్వరి మరో నియోజకవర్గం చూసుకోవలసి వచ్చింది. సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మారిన ఆమెను ఎలాగైనా మళ్ళీ లోక్ సభలో చూడాలన్న కోరిక ఆ కుటుంబంలో ఉంది. దానితో ఆమెకు గుంటూరు లోక్ సభ టికెట్ ఇస్తారన్న ప్రచారం జరిగింది. కానీ అక్కడి సిటింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావు కమ్మ కులస్ధుడు. మరి ఏ ఈక్వేషన్స్ పనిచేశాయో తెలియదు కానీ పురంధరేశ్వరి దృష్టి ఇప్పుడు ఒంగోలు లేదా నరసరావుపేటల మీద పడింది. ఒంగోలు సిటింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. నరసరావుపేట సిటింగ్ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. పురంధరేశ్వరి రెడ్ల సీట్లకు ఎసరుపెట్ట్డానికి ప్రయత్నించడంపై ఆ రెండు జిల్లాల్లో ఆ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications