తనపై వస్తున్న వ్యాఖ్యలకు టాలీవుడ్ నటి, తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజా తీవ్రంగా కలత చెందుతున్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మరణంతో ఆమె రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడింది. దాంతో ఇప్పటికే బాధపడుతున్న ఆమెకు తాజా వ్యాఖ్యలు గోరు చుట్టు మీద రోకటి పోటులా తయారయ్యాయి. రోజాను తెలుగుదేశం వర్గాలు ఐరన్ లెగ్ గా నిందిస్తున్నాయి. ఆమె తెలుగుదేశం పార్టీలోకి ప్రవేశించిన తొలి నాళ్లలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై అలిపిరిలో నక్సల్స్ దాడి జరిగింది. ఆయన ప్రాణాల నుంచి బయట పడడం ఒక రకంగా అత్యంత అదృష్టకమైన సంఘటనే అని చెప్పాలి. ఇప్పుడు ఆమె తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెసులో చేరడానికి నిర్ణయించుకుని అందుకు వైయస్ రాజశేఖర రెడ్డితో భేటీ అయ్యారు. ఆ వెనువెంటనే రాజశేఖర రెడ్డి ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అందువల్ల రోజా కాలు పెడితే అంత మంచిది కాదని తెలుగుదేశం పర్గాలు ప్రచారం మొదలు పెట్టాయి. దీంతో ఆమె నేడో రేపో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తారని వినికిడి. ఆ తర్వాత కాంగ్రెసులో చేరుతారట.